ఎవరీ నంబూరి తిలక్ వర్మ, క్రికెట్ కష్టాలు – ఆస్తి విలువ… కార్ల కలెక్షన్

తిలక్ వర్మ. కోట్లాది మంది ఫ్యాన్స్ కు ఫేవరెట్ క్రికెటర్ గా మారిపోయాడు. 2025 ఆసియా కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మ బ్యాటింగ్..


గెలిపించిన తీరు ను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతావని తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ప్రశంసించింది. ఇక.. హైదరాబాద్ లో జన్మించి.. క్రికెట్ శిక్షణ కోసం పడిన కష్టం ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వర్మ ఆస్తుల విలువ.. కార్ల కలెక్షన్లు గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే.

తెలుగు తేజం తిలక్ వర్మ. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ యావత్ అభినందిస్తున్న పేరు. హైదరాబాద్ కు వచ్చిన తిలక్ వర్మకు అపూర్వ స్వాగతం లభించింది. క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడిన తిలక్ వర్మ ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చాడు. తిలక్ వర్మ 2002 నవంబర్ 8న హైదరాబాద్‌లో తెలుగు కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి (నంబూరి నాగరాజు) ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవారు, అతని తల్లి హౌస్ వైఫ్. తిలక్ వర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. 11 సంవత్సరాల వయసులో కోచ్ సలీం బయాష్ అతన్ని టెన్నిస్ క్రికెట్ ఆడుతుండగా చూశాడు. బయాష్ అతన్ని తన స్కూటర్‌పై 40 కిలోమీటర్ల దూరంలో లింగంపల్లిలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీకి తీసుకెళ్లేవాడు. తరువాత తిలక్ వర్మ కెరీర్ కోసం కుటుంబం అకాడమీ దగ్గరికి మకాం మార్చింది.

22 ఏళ్ల తిలక్ వర్మ ఎడమచేతి వాటం బ్యాటర్. భారత్ తరపున వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు. తిలక్ 2 సంవత్సరాల కిందట సెప్టెంబర్ 15, 2023న వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అంతకు ఒక నెల ముందు టీ20లలో అరంగేట్రం చేశాడు. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున 2022లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి ఏడాదిలోనే ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 1 కోటి 70 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో తిలక్ కు 8 కోట్ల రూపాయలు దక్కింది. ఫిబ్రవరి 2025 నాటికి నివేదికల ప్రకారం తిలక్ నికర విలువ 5 కోట్ల రూపాయల వరకు ఉంది. తిలక్ ప్రధాన ఆదాయం బీసీసీఐ.. ఐసీఎల్ కాంట్రాక్టుల.. ప్రకటనల నుంచి అందుతోంది. తిలక్ వద్ద కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం తిలక్ వద్దMercedes Benz S-Class, BMW 7 Series కార్లు ఉన్నాయి. దీనితో పాటు SS స్పోర్ట్స్, బోట్ మొదలైన వాటితో ఒప్పందాలు చేసుకోవటంతో ఆ ఆదాయం అందుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.