అక్కడ దసరా వేడుకలు భిన్నం.. దేవత సమావేశం.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు క్యూ..

భారతదేశంలోని గల్లీ గల్లీదసరా వేడుకని ఘనంగా జరుపుకుంటారు. దసరా పండగ విజయానికి చిహ్నంగా భావిస్తారు. కొన్ని చోట్ల.. రావణుడిని దహనం చేస్తారు. మరికొన్ని చోట్ల రామ్ లీలాను నిర్వహిస్తారు.


అయితే హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోయలో దసరా వేడుకల ఇతివృత్తంతో విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ దసరా రోజున దేవతల గొప్ప సమావేశం జరుగుతుంది. అందుకే కులులోని దసరా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. కులులోని దసరా అంతర్జాతీయ వేడుకగా ప్రత్యేక సంప్రదాయంతో, ఆధ్యాత్మికతతో ప్రసిద్ధి చెందింది.

2025లో కులులో దసరా పండగను అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ వారమంతా జానపద నృత్యాలు, సంగీత వాయిద్యాల ధ్వని, వేలాది మంది భక్తులతో లోయలో ఒక అద్భుతమైన ప్రపంచం కనిపిస్తుంది.

కులు దసరా ఎలా ప్రారంభమైంది?

ఈ ప్రత్యేకమైన పండుగను 17వ శతాబ్దంలో కులు రాజు జగత్ సింగ్ ప్రారంభించాడు. ఒక పురాణం ప్రకారం దురాశతో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రాజును ఒక బ్రాహ్మణ కుటుంబం శపించింది. ఈ శాపం వల్ల అతను అశాంతితో బాధపడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి చేయకపోవడంతో.. ఒక ఋషి రాముడు ఆశీస్సులు పొందమని రాజు జగత్ సింగ్ కు సలహా ఇచ్చాడు.

తన తప్పుకు పశ్చాత్తాపపడిన రాజు రఘునాథుని విగ్రహాన్ని ప్రతిష్టించి.. మొత్తం కులు లోయలో ఉన్న దేవతలకు ఆహ్వానాలు పంపాడు. ఈ సంప్రదాయం అలా ప్రారంభమైంది. నేటికీ, 375 సంవత్సరాలకు పైగా, విజయదశమి నాడు దసరా పండగ ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు పండుగను జరుపుకుంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దసరా నుంచి ఏడు రోజుల పాటు గొప్ప వైభవంగా జరుపుకుంటున్నారు.

కులు దసరా పండుగలో ఏం జరుగుతుంది?

విజయదశమి నుంచి ప్రారంభమై ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో కులు లోయలోని మారుమూల గ్రామాల నుంచి ప్రజలు అలంకరించబడిన పల్లకీలలో దేవతలను దాల్పూర్ మైదానాలకు తీసుకువెళతారు. డప్పుల దరువులు, జానపద నృత్యాలు, సాంప్రదాయ సంగీత వాయిద్యాల రాగాలతో మొత్తం వాతావరణం నిండిపోతుంది. ఉత్సవాల్లో చివరి రోజున రఘునాథ్ ప్రభువు రథయాత్రగా వేలాది మంది భక్తులు దర్శించుకుండగా.. దల్పూర్ మైదాన్ చేరుకుంటాడు. ఈ దృశ్యం దేవతలు, మానవుల అద్భుతమైన సంగమంగా కనిపిస్తుంది.

కులులో దసరా వేడుకలు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. సంస్కృతి, జానపద జీవితాన్ని దగ్గరగా చూడవచ్చు. ఈ సమయంలో హిమాచలి నృత్యాలు, జానపద పాటలు, తరతరాలుగా వచ్చిన సంప్రదాయాలు కనిపిస్తాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.