ఇద్దరు హీరోలు ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సంచలనం.. మరొకరు సినిమాల్లో..

పైన ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారు మంచి స్నేహితులు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కుటుంబాల నుంచి వచ్చారు.


కానీ ఇప్పుడు అందులో ఒకరు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. మరొకరు ల్లో వరుస హిట్స్ అందుకుంటున్నారు. తమిళ పరిశ్రమకు చెందిన ఈ ఇద్దరికి తెలుగు, హిందీలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆ కుర్రాళ్లు ఇద్దరు మరెవరో కాదండి.. సౌత్ హీరోస్ సూర్య, విజయ్ దళపతి. అందులో ఇద్దరి మధ్య కనిపిస్తున్న నటుడు సూర్య తండ్రి శివకుమార్. నిజానికి విజయ్ సూర్య కంటే సంవత్సరం పెద్దవాడు. ఇద్దరూ చెన్నైలోని లయోలా కళాశాలలో తమ విద్యను పూర్తి చేశారు.

కాలేజీ రోజుల్లోనే వీరిద్దరూ మంచి స్నేహితులు. వారు తరచూ పార్టీలు, కుటుంబ కార్యక్రమాల, ప్రివ్యూలకు కలిసి హాజరవుతారు. అలాగే సామాజిక సేవలు, దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1997లో నెరుక్కు నేర్ అనే చిత్రంలో వీరిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన ‘ఫ్రెండ్స్’ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. తాను విజయ్ ఇప్పటికీ కాలేజీ పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో ఉన్నామని.. ఇద్దరం ఎంతో యాక్టివ్ గా అందులో చాట్ చేస్తుంటామని అన్నారు.

సూర్య చివరగా రెట్రో తో అడియన్స్ ముందుకు వచ్చారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మరోవైపు విజయ్ దళపతి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న స్థానిక ఎన్నికలలో ఆయన ప్రత్యేకంగా పోటీ చేయనున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.