రాకెట్ కన్నా వేగంగా పెరుగుతున్న బంగారం ధర… తులం పసిడి ఏకంగా రూ. 1.20 లక్షలు దాటేసింది

బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తోంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బంగారం ధర ఏకంగా 1.20 లక్షల రూపాయలు దాటేసింది. అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,020 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,07,550 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,48,076 పలికింది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పెరిగింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధర 10 గ్రాములకు గాను 1.20 లక్షల రూపాయలు పలికింది. ఇది ఆల్ టైం గరిష్ట స్థాయి అని చెప్పవచ్చు. బంగారం ధర గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే దాదాపు ప్రతిరోజు పెరుగుతోంది. పసిడి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే కారణం అని చెప్పవచ్చు. పసిడి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది సామాన్యులకు దాదాపు అసాధ్యంగా మారుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 45 శాతం పెరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాకెట్ వేగం అని చెప్పవచ్చు.
బంగారం ధర పెరగడానికి కారణాలు ఇవే
బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3845 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది. ముఖ్యంగా అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ భయం ఇన్వెస్టర్లలో నెగెటివిటీని పెంచిందని చెప్పవచ్చు. ఫలితంగా బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. CME FedWatch Tool ప్రకారం 97% ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. వడ్డీ రేటు తగ్గినప్పుడల్లా బంగారం వంటి ఆస్తులకు ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది.
అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ వార్తలు ఎక్కువగా బంగారం కొనుగోలు దిశగా ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు దీనికి తోడు అమెరికా జాబ్స్ డేటా కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదం చేసింది. ఇక దేశీయ మార్కెట్ల విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని నగల షాపుల యజమానులు చెబుతున్నారు.
సరికొత్త రికార్డు సృష్టించిన సిల్వర్
బంగారం ధర పెరగడంతో పాటు సిల్వర్ ధర సైతం ప్రతిరోజూ భారీగా పెరుగుతోంది. సిల్వర్ ధర పెరగడానికి ప్రధానంగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక కేజీ సిల్వర్ ధర 1.48 లక్షల రూపాయలుగా ఉంది. దీంతో సిల్వర్ పై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.