గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు.. ఎంతంటే..

చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 1, 2025 నుండి ఇంధన ధరలను సవరించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15.50 పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటరుకు రూ.3,052.50 పెరిగింది. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,595.50 ఉంది. ఇది గతంలో రూ.1,580 ఉంది. డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలలో మార్పు లేదు.


కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు (19 కిలోల సిలిండర్)

  • ఢిల్లీ: రూ.1,595.50

  • కోల్‌కతా: రూ.1,700.50

  • ముంబై: రూ.1,547.00

  • చెన్నై: రూ.1,754.50

ఏటీఎఫ్‌ ధరలు (అక్టోబర్ 1, 2025 నుంచి కిలోలీటర్‌కు)

  • ఢిల్లీ: రూ.93,766.02

  • కోల్‌కతా: రూ.96,816.58

  • ముంబయి: రూ.87,714.39

  • చెన్నై: రూ.97,302.14

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న ఇంధన ధరల సాధారణ నెలవారీ సమీక్షలో భాగంగా ఈ సవరణలు జరిగాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.