ప్రముఖ స్మార్ట్‌ఫోన్(new-smartphone) తయారీ కంపెనీ Realme తన Realme 15 seriesలో తాజా స్మార్ట్‌ఫోన్ అయిన Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఈ Realme 15X 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో పనిచేస్తుంది. 8GB RAM + 10GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనికి 7000mAh బ్యాటరీ అందించారు. ఇప్పుడు Realme 15X 5Gకి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
Realme 15X 5G Price
Realme 15X 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ Realme 15X 5G ఫోన్ ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మెరూన్ రెడ్ కలర్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక సైట్, మెయిన్‌లైన్ స్టోర్లలో సేల్కు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లో భాగంగా రూ.1,000 బ్యాంక్ ఆఫర్ లేదా రూ.2,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక సైట్లో రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఇంకా 6 నెలల పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను లభిస్తున్నాయి.
Realme 15X 5G Specs
Realme 15X 5Gలో 6.8-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే, 1570×720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో ఆర్మ్ మాలి-G57 MC2 GPUతో వస్తుంది. Realme 15X 5G.. 6GB/8GB LPDDR4X RAM + 128GB/256GB UFS 2.2 స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ Android 15 ఆధారంగా Realme UI 6.0పై నడుస్తుంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. Realme 15X 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Realme 15X 5G.. 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్ ఉంది. దీనితో పాటు ఇది మిలిటరీ-గ్రేడ్ మన్నిక కోసం MIL-STD 810H సర్టిఫికేషన్‌తో వస్తుంది.
































