మీ రోజును టీ, కాఫీ లేక గ్రీన్ టీతో మొదలుపెట్టడం మామూలే. కానీ ఆరోగ్య నిపుణుల మాట వినితే, ఈ అలవాట్లను పక్కనబెట్టి ఖాళీ కడుపుతో ఓ ఆపిల్ తినడం వల్ల శరీరం, మానసిక స్థితి, జీర్ణక్రియ, అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు.
ప్రాచీన ఆంగ్ల సామెత “An apple a day keeps the doctor away” యథార్థంగా మారిపోతుందని, ఇప్పుడు వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు కూడా సమ్మతిస్తున్నారు.
ఉదయం ఆపిల్ తినడం వల్ల కలిగే అద్భుత ప్రభావాలు ఇవే!
1. జీర్ణక్రియ మెరుగవుతుంది, శక్తి పెరుగుతుంది
ఆపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తింటే, ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ప్రొబయోటిక్ ప్రభావం కలిగించి కడుపును శుభ్రంగా ఉంచుతుంది. సహజ చక్కెర శక్తిని ఇస్తూ, ఉదయాన్నే యాక్టివ్‌గా మారతారు.
2. బరువు తగ్గాలనుకునేవారికి స్నేహితుడే!
ఆపిల్‌లోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. మధ్యాహ్నం వరకు మళ్ళీ తినాలన్న తాపత్రయం రాకుండా ఉంచుతుంది. దీనివల్ల క్యాలొరీలు తగ్గుతాయి, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. వ్యాయామం చేసే వారికి ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.
3. మానసిక ఉల్లాసం – ఫ్రెష్ ఫీల్!
ఆపిల్ తిన్న తర్వాత చాలా మందికి మానసికంగా ప్రొత్సాహం, ఉల్లాసభరితమైన అనుభూతి కలుగుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం మంచి మూడ్‌ని అందిస్తుంది.
4. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది
ఆపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C వంటివి చర్మాన్ని ముడతల నుంచి రక్షిస్తాయి. చర్మానికి సహజ మెరుపు, ఫ్రెష్‌నెస్ ఇస్తాయి. రెగ్యులర్‌గా తీసుకుంటే చర్మం తేజస్సుతో మెరుస్తుంది.
5. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది
ఆపిల్ తీసుకునే వారు ఒక నెల తర్వాత జుట్టు పెరుగుదల మెరుగైందని, దెబ్బతినకుండా బలంగా మారిందని చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు రూట్లకు బలాన్నిస్తాయి.
































