కుమారుడి పేరు వెల్లడించిన వరుణ్ తేజ్‌ దంపతులు

నటుడు వరుణ్‌ తేజ్‌ – లావణ్య త్రిపాఠిలకు సెప్టెంబర్‌ 10న బాబు పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిన్నారికి బారసాల కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా తన కుమారుడి పేరును సోషల్‌ మీడియా వేదికగా వరుణ్ తేజ్‌ (Varun Tej) రివీల్‌ చేశారు. ‘ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకు ‘వాయువ్‌ తేజ్‌ కొణిదెల’ (Vaayuv Tej) అనే పేరు పెట్టాం. మీ అందరి దీవెనలు కావాలి’ అంటూ కొన్ని ఫొటోలు పంచుకున్నారు.


లావణ్య త్రిపాఠిని వరుణ్‌ తేజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం వరుణ్‌ – లావణ్య (Lavanya Tripathi) తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 2023 నవంబర్‌ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.