నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ మర్చిపోవడం సర్వసాధారణం. మీ ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోతే మీ ఇంట్లో నుంచే సింపుల్‌గా ఇలా రీసెట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కోట్లాది మంది అకౌంట్ హోల్డర్స్‌కి బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ. కస్టమర్లు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ (SBI Net Banking) ద్వారా బ్యాంకింగ్ సేవల్ని పొందుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల బ్యాంకింగ్ సేవల్ని యాక్సెస్ చేయలేకపోతారు. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి బ్యాంక్ వరకు వెళ్తుంటారు.
బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి నుంచే పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లడం ఒక మార్గం అయితే ప్రొఫైల్ పాస్వర్డ్ ఉపయోగించడం, ఏటీఎం కార్డు వివరాలతో రీసెట్ చేయడం మరో రెండు ఆప్షన్స్. ఎస్బీఐ ఆన్లైన్ పోర్టల్‌లో మీ ప్రొఫైల్ పాస్వర్డ్ లేదా ఏటీఎం కార్డు వివరాలు ఉపయోగించి పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలో తెలుసుకోండి.
ఆన్లైన్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ముందుగా ఎస్బీఐ ఆన్లైన్ వెబ్సైట్ కి వెళ్లండి. ‘పర్సనల్ బ్యాంకింగ్’ లో ‘లాగిన్’ పైన క్లిక్ చేయండి. ‘కంటిన్యూ టు లాగిన్’ బటన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ స్క్రీన్‌లో ‘ఫర్గాట్ యూజర్‌నేమ్/లాగిన్ పాస్వర్డ్’ పైన క్లిక్ చేయండి. ఓ చిన్న విండో ఓపెన్ అవుతుంది. అందులో ‘ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్’ సెలెక్ట్ చేసి ‘నెక్స్ట్’ పైన క్లిక్ చేయండి.
తర్వాతి స్క్రీన్‌లో యూజర్‌నేమ్, అకౌంట్ నంబర్, పుట్టిన తేది, మొబైల్ నంబర్, దేశం, క్యాప్చా కోడ్ లాంటి వివరాలు ఎంటర్ చేసి ‘సబ్మిట్’ పైన క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని స్క్రీన్‌పై ఎంటర్ చేసి ‘కన్ఫర్మ్’ చేయండి. తర్వాతి పేజీలో ‘యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్’ లేదా ‘యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్’ లలో ఒకదాన్ని ఎంచుకుని ‘సబ్మిట్’ పైన క్లిక్ చేయాలి.
తర్వాతి స్క్రీన్‌లో మీరు ఎంచుకున్న ఆప్షన్‌కి సంబంధించిన వివరాలు ఇచ్చి ‘కన్ఫర్మ్’ చేయండి. ఇప్పుడు మీకు ఒక రిఫరెన్స్ నెంబర్‌తో పాటు లింక్ వస్తుంది. లింక్ పైన క్లిక్ చేయండి. కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి ‘సబ్మిట్’ చేయండి. ఇక మీరు కొత్త పాస్వర్డ్ తో నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ కావచ్చు.
ఏటీఎం డెబిట్ కార్డు ఉపయోగించి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ఓటీపీ లేకుండా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చాలంటే మాత్రం మీ బ్రాంచ్ కి వెళ్లాలి. అక్కడ ‘డుప్లికేట్ లాగిన్ పాస్వర్డ్ ఫారమ్’ తీసుకోవాలి. ఫామ్ పూర్తి చేసి సబ్మిట చేస్తే బ్యాంక్ నుంచి మీకు కొత్త పాస్వర్డ్ ఇస్తారు.
మీరు మరోసారి పాస్వర్డ్ మర్చిపోకుండా ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోండి. మీ పాస్వర్డ్ సింపుల్‌గా గుర్తించేలా కాకుండా, కాస్త కష్టంగా ఉండేలా చూసుకోండి. పాస్‌వర్డ్‌లో ఇంగ్లీష్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ తప్పనిసరిగా ఉండాలి. మీ పాస్వర్డ్ తరచూ మారుస్తూ ఉండాలి. కనీసం నెల రోజులకు ఒకసారైనా పాస్వర్డ్ మార్చాలి.
































