అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) 2025 పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) తాజాగా ప్రకటించింది. ఈ రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు..

 


దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) 2025 పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) తాజాగా ప్రకటించింది. ఈ రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. రాత పరీక్షను జూలై 15 నుంచి ఆగస్టు 31 మధ్య దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

నవంబరు 3 నుంచి ఏపీ ఆర్‌సెట్‌ 2025 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌ 2025ను నవంబరు 3 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి తిరుపతిరావు ఓ ప్రటకనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబరు 7 నుంచి చేపడతామని అన్నారు. అక్టోబర్‌ 6న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదికి ఆర్‌సెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.