చాలామంది ప్రజలు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. దానికి రహస్యం ఏమై ఉంటుందని అన్వేషిస్తుంటారు. తాజాగా, ఒక అమెరికన్-స్పానిష్ వృద్ధురాలు మారియా బ్రాన్యాస్ మోరర్ జీవితశైలిని పరిశోధకులు అధ్యయనం చేశారు.
ఈమె 117 ఏళ్ల 168 రోజుల వయసులో, 2024 ఆగస్టులో మరణించారు. అప్పటికి ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు.
సెప్టెంబర్ 24న ‘సెల్ రిపోర్ట్స్ మెడిసిన్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, పరిశోధకులు బ్రాన్యాస్ రక్తం, లాలాజలం, మూత్రం, మలం, జీనోమ్లను అధ్యయనం చేశారు.
చిరంజీవి ఫార్ములా: రోజుకు మూడుసార్లు పెరుగు
బ్రాన్యాస్ ధూమపానం చేయలేదు, మద్యం తాగలేదు. అలాగే గ్రామీణ ప్రాంతంలో జీవించారు. మితమైన వ్యాయామం, ఆలివ్ ఆయిల్ (నూనె) కలిగిన మెడిటేరియన్ తరహా ఆహారాన్ని తీసుకునేవారు. అయితే, ఆమె జీవనశైలిలో కొంచెం అసాధారణమైన ఒక విషయం ఉంది. అదేమిటంటే… ఆమె రోజుకు మూడుసార్లు పెరుగు తీసుకునేవారు.
పెరుగు.. చిరకాల ఆరోగ్యానికి దివ్యౌషధం!
ఈ విషయంపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ దృష్టి సారించారు. అక్టోబర్ 2న తన సోషల్ మీడియా పోస్ట్‌లో పెరుగు వినియోగం గురించి ప్రస్తావిస్తూ, ఇది దీర్ఘాయుష్షుకు ఉత్తమమైన సప్లిమెంట్లలో ఎందుకు ఒకటిగా మారిందో వివరించారు.
“పెరుగు తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, పెద్దపేగు పాలిప్స్ (polyps) వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది బలమైన, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా, మెరుగైన రోగనిరోధక శక్తికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది” అని డాక్టర్ సల్హాబ్ చెప్పారు.
పెరుగుకు దీర్ఘాయుష్షుకు లింక్ ఏంటి?
పెరుగు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఆసక్తి చూపారు. పెరుగు ఏదో శాశ్వతంగా జీవించేలా చేసే మ్యాజిక్ మాత్ర కాదు. కానీ, “మీరు తినగలిగే అత్యంత రక్షణ కలిగించే ఆహారాలలో ఇది ఒకటిగా అధ్యయనాలు చెబుతున్నాయి” అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వివరించారు.
ఆరోగ్యకరమైన ‘గట్’ అంటే… దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువే!
నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రమం తప్పకుండా పెరుగు తినే వ్యక్తులకు పెద్దపేగు క్యాన్సర్, పెద్దపేగు పాలిప్స్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, పెరుగు తినడం వల్ల గట్‌లో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యంగా, బలంగా మారుతుంది.
ఆరోగ్యకరమైన, బలమైన గట్ (జీర్ణవ్యవస్థ) వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
“ఒక డాక్టర్‌గా, నేను ప్రతిరోజూ తినడం అస్సలు మానని ఒకే ఒక్క ఆహారం ఇది. నేను దీన్ని చియా సీడ్స్, తేనె, డార్క్ చాక్లెట్ లేదా తాజా పండ్లతో కలిపి తీసుకుంటాను” అని డాక్టర్ సల్హాబ్ తెలిపారు.
(పాఠకులకు సూచన: ఈ కథనం కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ఉద్దేశించింది. వృత్తిపరమైన వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
































