నిరుద్యోగులకు కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్.. అప్లై చేస్తే జాబ్ పక్కా

ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కెనరా బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ మేరకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులకు ఒక ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించడానికి అత్యుత్తమ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఖాళీలు..

3500

ఆంధ్రప్రదేశ్: 242

తెలంగాణ: 132

విభాగాల వారీ కేటాయింపు..

SC – 557

ST – 227

OBC – 845

EWS – 337

UR (General) – 1534

అర్హతలు..

గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ కావాలి.

డిగ్రీ పూర్తికావాల్సిన తేది: 01 జనవరి 2022 – 01 సెప్టెంబర్ 2025 మధ్య.

వయో పరిమితి (01 సెప్టెంబర్ 2025 నాటికి): 20-28 సంవత్సరాలు.

వయో సడలింపులు: OBC – 3 సంవత్సరాలు, SC/ST – 5 సంవత్సరాలు, ప్రభుత్వ విధానాల ప్రకారం ఇతర వర్గాలకూ వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం..

దరఖాస్తు ప్రారంభం: 23 సెప్టెంబర్ 2025

చివరి తేది: 12 అక్టోబర్ 2025

ఫీజు: రూ.500 (SC, ST, దివ్యాంగుల కోసం మినహాయింపు)

దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్: https://canarabank.bank.in/pages/Recruitment

శిక్షణ & భత్యం..

శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం

శిక్షణ సమయంలో నెలకు రూ.15,000 స్టైఫండ్ అందిస్తుంది.

శిక్షణ పూర్తయిన తరువాత, బ్యాంకులో ప్రొఫెషనల్ అనుభవం పొందే అవకాశం.

ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ, డిప్లొమా/డిగ్రీ ప్రమాణాలు, రిజర్వేషన్ నిబంధనలు, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది.

ప్రాక్టికల్ బ్యాంకింగ్ అనుభవం పొందడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఉపయోగపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.