ఇకపై రైళ్లలో సీట్లు ఉండవు! ఈ సెటప్ చూస్తే వావ్ అనాల్సిందే

రోజురోజుకీ ట్రైన్ జర్నీలు చాలా అప్ డేట్ అవుతున్నాయి. మనదేశంలో కూడా వందేభారత్ వంటి హైస్పీడ్ ట్రైన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో స్లీపర్ కోచ్ లు రాబోతున్నాయి.


అలాగే ఫ్యూచర్ లో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ కూడా పరుగులు పెట్టనుంది. అయితే ఇదిలాగే కంటిన్యూ అయితే ఇండియాలో జపాన్ తరహాలో హైఎండ్ ప్రీమియం ట్రైన్స్ రావొచ్చు. ఇవి కదిలే ఇంద్రభవనంలా ఉంటాయి. లోపల విలాసవంతమైన సీటింగ్, సైట్ సీయింగ్ కోసం చుట్టూ అద్దాలు.. ఈ ప్రీమియం ట్రైన్స్ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే.

కదిలే ఇంద్రభవనం

జపాన్‌లోని కింటెత్సు రైల్వే సంస్థ షిమకాజే అనే ప్రీమియం సైట్‌సీయింగ్ ట్రైన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు ఒసాకా, క్యోటో, నాగోయా నుంచి ఈస్-షిమా ప్రాంతానికి వెళ్తుంది. అయితే ఇది ప్రపంచంలోని అత్యంత లగ్జరీ ట్రైన్స్ లో ఒకటి. దీని డిజైన్ చూస్తే మతి పోతుంది. ఇందులో సీట్లకు బదులు రిక్లైనర్లు ఉంటాయి. ప్రతి సీటుకి ఎలక్ట్రిక్ లెగ్ రెస్ట్, ఎయిర్ కుషన్ బ్యాక్, లంబార్ సపోర్ట్ ఉన్నాయి. ప్రతి సీటుకూ పర్సనల్ మానిటర్ కూడా ఉంటుంది. అలాగే సైట్ సీయింగ్ కోసం పెద్ద గ్లాస్ విండోలు ఉన్నాయి. వీటితోపాటు ఈ ట్రైన్ లో కెఫె కార్ రైలు అనే బోగి ఉంటుంది. ఇందులో ఫుడ్ సర్వ్ చేస్తారు. అలాగే ఇందులో వై-ఫై, లగ్జరీ టాయిలెట్స్ ఉంటాయి.

ఇండియాలో కూడా

ఇకపోతే మనదేశంలో కూడా ఇలాంటి ట్రైన్ తీసుకురావాలని రైల్వే ప్రయాణీకులు కోరుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత భారతదేశంలో ప్రీమింయం రైల్వే మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ట్రైన్స్ వస్తే.. రైల్ ప్రయాణం ఒక లగ్జరీ అనుభవంగా మారుతుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.