నేరుగా బంగారాన్ని కొనలేని వాళ్లు డిజిటల్ గోల్డ్ అనే ఆప్షన్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చని మీకు తెలుసా? నిజమే. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే డిజిటల్ గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.
దీని వాల్యూ నిజమైన బంగారం రేట్లకు అనుగుణంగా మారుతుంటుంది. అయితే ఈ డిజిటల్ గోల్డ్ ను సింపుల్‌గా ఫోన్లోనే కొనుగోలు చేయొచ్చు! మీకు ఫోన్‌పే అకౌంట్ ఉంటే చాలు. యాప్ ద్వారా మీరు డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడం, అమ్మడం వంటివి చేయొచ్చు. పైగా పెట్టుబడి పెట్టే ప్రాసెస్ కూడా చాలా సింపుల్.
ప్రాసెస్ ఇదే..
బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్‌తో మీ ఫోన్‌పే అకౌంట్ సెటప్ చేసిన తర్వాత ఫోన్‌పే హోమ్ పేజీలో డిజిటల్ గోల్డ్ అనే బాక్స్ అనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. డైలీ సేవింగ్స్, బయ్ డిజిటల్ గోల్డ్, గోల్డ్ లోన్, మంత్లీ గోల్డ్ సిప్ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో బయ్ డిజిటల్ గోల్డ్ పై క్లిక్ చేసి.. మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ను ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయగానే పక్కన దానికి సమానమైన బంగారం వెయిట్ కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.500 ఎంటర్ చేస్తే.. అక్కడ 0.0401 గ్రాములు అని చూపిస్తుంది. ఇది బంగారం ధరను బట్టి మారుతుంది. తర్వాత ప్రొసీడ్ నొక్కి పేమెంట్ చేస్తే చాలు. మీరు బంగారం సొంతం చేసుకున్నట్టే. ఫోన్‌పే ప్రకారం ఈ ఫీచర్‌ని ఉపయోగించి పెట్టుబడి పెట్టడానికి 45 సెకన్లు మాత్రమే పడుతుంది. తక్కువ టైమ్ లో, వేగంగా, సౌకర్యవంతంగా బంగారం కొనుగోలు చేసేలా ఈ ప్రాసెస్ రూపొందించారు
ఇవి కూడా..
ఇకపోతే ఈ డిజిటల్ బంగారాన్ని అమ్మడం కూడా చాలా సులభం. మీరు ఆల్రెడీ బంగారాన్ని కొని ఉంటే అక్కడే సెల్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దానపై క్లిక్ చేసి అప్పుడు ఉన్న రేటుకి అమ్మేయొచ్చు. ఇక వీటితోపాటు మంత్‌లో గోల్డ్ సిప్ ద్వారా ప్రతినెలా డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మీరు కొన్న గోల్డ్‌పై లోన్ కూడా తీసుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యంగా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మారుతున్న మార్కెట్ ధరలను గమనించడం ముఖ్యం. తక్కువ ఉన్నప్పుడు కొనడం, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మడం చేయడం ద్వారా నష్టపోకుండా చూసుకోవచ్చు.
































