సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలివే – సీట్ల కేటాయింపు ఎప్పుడంటే…?

ఏపీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు ఈనెల 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 10వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. https://edcet-sche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల జరుగుతుండగా… ఈ గడువు అక్టోబర్ 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 4వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://edcet-sche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.


అక్టోబరు 5 నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ గడువు అక్టోబర్ 7వ తేదీతో పూర్తవుతుంది. 8వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈనెల 13వ తేదీలో లోపు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ తేదీ నుంచి తరగతులు కూడా ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు.

ఈసారి నిర్వహించిన ఏపీ ఎడ్ సెట్ పరీక్షకు మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 14,527 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  1. అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఎడ్ సెట్ – 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబ‌ర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట‌ర్ చేయాలి.
  4. సబ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే ఫ‌లితాలు డిస్ ప్లే అవుతాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.