ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల… ఎగ్జామ్స్ తేదీలు ఇలా…

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్… ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్ బోర్డు శుక్రవారం రోజున విడుదల చేసింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు ఇంటర్‌ బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సిలబస్‌లో సవరణ, గ్రూప్‌ల ఎంపికలో కొత్త సబ్జెక్ట్ కాంబినేషన్లు, పరీక్షల విధానంలో సమూల మార్పులు అమలు చేస్తుంది. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో ఈ సంస్కరణ తీసుకొచ్చింది.

అయితే తాజాగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండగా మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. ఇక, ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుండగా, మార్చి 23 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక, ఇంటర్ విద్యార్థులకు జనవరి 21వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, జనవరి 23వ తేదీన పర్యావరణ పరిరక్షణ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టీకల్స్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. అయితే ఇది తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనని, పరిస్థితిని బట్టి ఇందులో మార్పు చేసే అవకాశం ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ (Andhra Pradesh Inter 1 st Year Exams 2026 Schedule)…
>> ఫిబ్రవరి 23 – తెలుగు/సంస్కృతం/ఉర్దూ/ హిందీ/తమిళం/ఒరియా/కన్నడ/ అరబిక్/ఫ్రెంచ్/పర్శియన్ లాంగ్వేజ్ పేపర్ 1
>> ఫిబ్రవరి 25 – ఇంగ్లీషు పేపర్ 1
>> ఫిబ్రవరి 27 – హిస్టరీ పేపర్ 1
>> మార్చి 2- మ్యాథ్స్ పేపర్ 1
>> మార్చి 5 – బయోలాజీ పేపర్ 1
>> మార్చి 7 – ఎకానమిక్స్ పేపర్ 1
>> మార్చి 10 – ఫిజిక్స్ పేపర్ 1
>> మార్చి 12 – కామర్స్ పేపర్ 1/ సోషియాలజీ పేపర్ 1/ ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
>> మార్చి 14 – సివిక్స్ పేపర్ 1
>> మార్చి 17 -కెమిస్ట్రీ పేపర్ 1
>> మార్చి 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1/లాజిక్ పేపర్ 1
>> మార్చి 24 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1 /జియోగ్రఫీ పేపర్ 1

ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ (Andhra Pradesh Inter 2nd Year Exams 2026 Schedule)…
>> ఫిబ్రవరి 24- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
>> ఫిబ్రవరి 26 – ఇంగ్లీష్ పేపర్ 2
>> ఫిబ్రవరి 28 – బోటనీ పేపర్ 2 / హిస్టరీ పేపర్ 2
>> మార్చి 3 – మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ పేపర్ 2
>> మార్చి 6- జూవాలజీ పేపర్ 2/ ఎకనామిక్స్ పేపర్ 2
>> మార్చి 9- మ్యాథ్స్ పేపర్ 2 బి
>> మార్చి 11- కామర్స్ పేపర్ 2/ సోషియాలజీ పేపర్ 2 / ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ 2
>> మార్చి 13- ఫిజిక్స్ పేపర్ 2
>> మార్చి 16 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2 / జియోగ్రఫీ పేపర్ 2
>> మార్చి 18 – కెమిస్ట్రీ పేపర్ 2
>> మార్చి 23 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2 / లాజిక్ పేపర్ 2

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.