అవన్నీ సైలెంట్ కిల్లర్ లక్షణాలే.. శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ డబుల్ అయినట్లే..

ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ సమస్య పెను ప్రమాదంగా మారుతోంది.. వాస్తవానికి అధిక కొలెస్ట్రాల్ సాధారణంగా ఎటువంటి లక్షణాలను చూపించదు.. కానీ గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే దీని ప్రభావాలు బయటపడతాయి.


లక్షణాలు కనిపించకపోవడానికి కారణం కొలెస్ట్రాల్ రక్తనాళాలలో ఫలకం (ప్లేక్) ఏర్పడటం, ఇది రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది. అయితే.. మీ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండి, దానికి వెంటనే పరిష్కారం కనుగొనకపోతే, అది మీ గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. మారుతున్న జీవనశైలి, ఆహారం కారణంగా నేడు చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇటీవలి సంవత్సరాలలో అధిక కొలెస్ట్రాల్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మీరు తీవ్రమైన, ప్రాణాంతక గుండె జబ్బులను నివారించాలనుకుంటే.. మీరు అధిక కొలెస్ట్రాల్ లక్షణాల గురించి తెలుసుకోవడంతోపాటు.. అవగాహనతో ఉండటం మంచిది..

హై కొలెస్ట్రాల్.. గమనించవలసిన లక్షణాలు ఇవే..

మీ చర్మంపై పసుపు రంగు మచ్చలు – గడ్డలు (జాంథెలాస్మా వంటివి) లేదా మీ కళ్ళ చుట్టూ తెల్లటి లేదా పసుపు రంగు వలయాలు కనిపిస్తే, మీకు అధిక కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం.

నిరంతరం అలసట కూడా అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం..

కొన్ని తీవ్రమైన సందర్భాలలో గుండె దడ, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు.. ఇవి రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం వలన సంభవిస్తాయి.

అయితే.. అధిక కొలెస్ట్రాల్‌కు స్పష్టమైన లక్షణాలు ఉండవు.. అందువల్ల రక్త పరీక్షలు చేయించుకోకుండానే దానిని నిర్ధారించలేరు.

వైద్యులను సంప్రదించండి..

ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే, మీరు వెంటనే అప్రమత్తంగా ఉండాలి.. కొలెస్ట్రాల్ పరీక్ష కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొలెస్ట్రాల్‌ను గుర్తించడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష నిర్వహిస్తారు. శరీరంలో ఏవైనా అసాధారణతలను ముందుగానే గుర్తించడానికి ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేయబడింది.

కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉండాలి?

మొత్తం కొలెస్ట్రాల్ 200 mg/dL కంటే తక్కువగా ఉంటే, అది సాధారణమైనదిగా పరిగణిస్తారు. కానీ LDL 100 mg/dL కంటే తక్కువగా ఉంటే, ఇది కూడా సాధారణమే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, HDL పురుషులలో 40 mg/dL, స్త్రీలలో 50 mg/dL కంటే ఎక్కువగా ఉండాలి. అదనంగా, ట్రైగ్లిజరైడ్లు 150 mg/dL కంటే తక్కువగా ఉండాలి. ఉండాల్సిన దానికంటే.. ఎక్కువగా ఉంటే.. అది హైకొలెస్ట్రాల్ గా పేర్కొంటారు.

మీకు ఏమైనా సమస్యలుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.