ఆదర్శవంతులుగా రుక్మిణీ వసంత్ తల్లిదండ్రులు

రుక్మిణీ వసంత్.. శాండిల్ వుడ్ హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా ద్వారా గత ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించింది.


ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా అమ్మడి అందానికి, నటనకు దర్శక నిర్మాతలు ఫిదా అయిపోయారు. అందులో భాగంగానే ఇటీవల కోలీవుడ్లో ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘మదరాసి’ సినిమాలో నటించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే రుక్మిణీ వసంత్ నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు లభించాయి.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలో అవకాశం లభించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఆమె తన పాత్రకు న్యాయం చేస్తుందా? అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా కాస్త సందేహం వ్యక్తం చేస్తూ.. ఎన్టీఆర్ నటనకు 80% మ్యాచ్ అవుతుందని, ఈమెను తీసుకున్నామంటూ సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదలైంది.

ఇందులో కనకావతి అనే యువరాణి పాత్రలో రుక్మిణీ వసంత్ జీవించేసింది. ముఖ్యంగా 200% తన అద్భుతమైన నటనతో అందరిని అబ్బురపరిచింది. అంతేకాదండోయ్ కొన్ని కొన్ని సీన్స్ లో హీరో రిషబ్ శెట్టిని కూడా ఆమె డామినేట్ చేసింది అంటే.. ఆమె నటన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క సినిమాతో రుక్మిణీ వసంత్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె తల్లిదండ్రులు ఎవరు? అనే విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి రుక్మిణీ వసంత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

రుక్మిణీ వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఈయన ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పఠాన్ కోట్, రాంచి తదితర ప్రాంతాలలో ఆర్మీకి సేవలు అందించారు. రుక్మిణీకి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడే వసంత్ వేణుగోపాల్ వీరమరణం పొందారు. విషయంలోకి వెళ్తే 2007లో కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో జమ్మూ కాశ్మీర్ లోని ఉరి ప్రాంతంలోకి ప్రవేశించగా.. వారిని గమనించిన కల్మల్ వసంత్ తన టీం తో కలిసి ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రమూకలను ఎదుర్కొన్న ఆయన.. శరీరంలోకి సుమారుగా ఏడుకు పైగా బుల్లెట్లు దిగగ.. కొనఊపిరితో చికిత్స పొందుతూ.. ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ధైర్య సాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అశోక చక్ర పథకంతో గౌరవించింది. అంతేకాదు కర్ణాటక రాష్ట్రం నుండి ఈ పథకం అందుకున్న తొలి వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు సొంతం చేసుకున్నారు.

వసంత్ వేణుగోపాల్ వీరమరణం తర్వాత ఆయన భార్య సుభాషిని వసంత్ “వీర్ రత్న ఫౌండేషన్ ” అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఇప్పటికే 120 కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటుపడుతున్నారు. భర్త ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ అటు రుక్మిణీ వసంత్ తల్లి కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఏదేమైనా రుక్మిణీ వసంత్ తల్లిదండ్రులు ఇద్దరు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.