హీరో నుండి విలన్ రోల్స్‌కు షిఫ్టయ్యారు మన్మధుడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. కుబేర, కూలీ రెండింటిలోనూ నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్. హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్ట్స్ తన 100వ సినిమాను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తీక్ తో సినిమా ఉండబోతుందని ఎనౌన్స్ చేశారు. దసరా సీజన్లోనే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాలనుకున్నారు కానీ కుదరలేదు.
ఈ మైల్ స్టోన్ మూవీని మొమరబుల్గా మార్చుకునేందుకు నాగ్ స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు.
అయితే లెటెస్టుగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం మనం తరహాలో సన్స్ చైతూ, అఖిల్ కూడా యాడ్ కాబోతున్నారన్నది టాక్. ఈ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారట. నాగ్ ను ఫ్యాన్స్ ముద్దుగా కింగ్ అని పిలుచుకుంటారు. ఆ కింగ్ పేరు కలిసి ఉండేలా ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అని అనుకున్నారట. ఆల్మోస్ట్ ఇదే ఫిక్స్ చేసారని కూడా తెలుస్తోంది. ఈ నెలలోనే పూజ కార్యక్రమాలతో షూట్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యూర్ అవుట్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడట. అన్నపూర్ణ బ్యానర్ లో సినిమాను భారీ బడ్జెట్ పై నిమించబోతున్నాడు అక్కినేని నాగార్జున. నాగ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో రోమాన్స్ చేయబోతున్నాడని సమాచారం. నాగ్ కెరీర్ లో 100వ వస్తున్న ‘లాటరీ కింగ్’ ఎలాంటి సంచలనం సృష్టింస్తుందో చూడాలి.
































