భారీగా తగ్గుతున్న బంగారం ధర… అక్టోబర్ 6వ తేదీ సోమవారం పసిడి ధరలు ఇవే…

నేడు అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,429 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.


1,09,479 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,50,240 పలికింది. బంగారం ధర గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. దాదాపు ప్రతిరోజు ఆల్ టైం రికార్డ్ స్థాయిని బద్దలు కొడుతూ ముందుకు దూసుకుని వెళ్ళింది. అయితే నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం మార్కెట్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా స్వల్పంగా తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు నిజానికి గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే విపరీతంగా పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధర ఒక లక్ష రూపాయల నుంచి 1.22 లక్షల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం గవర్నమెంట్ షట్ డౌన్ కార్యక్రమం నడుస్తోంది. దీనికి కారణంగా డాలర్ విలువ తగ్గడంతో ప్రస్తుతం బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా ఇబ్బంది కరం అని చెప్పవచ్చు.

బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తున్నప్పటికీ ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా రావడంలేదని బంగారు ఆభరణాల షాపుల యజమానులు చెబుతున్నారు. నిజానికి బంగారు ఆభరణాల ధరలు గడచిన ఏడాదికాలంగా చూసినట్లయితే విపరీతంగా పెరిగినట్లు గమనించవచ్చు. బంగారం ధర ఈ సంవత్సరం జనవరి నెల నుంచి అక్టోబర్ నెల వరకు గమనించినట్లయితే దాదాపు 45 శాతం పెరిగాయి. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ సమీపంలో ఉన్నాయి. ఈ స్థాయి నుంచి భవిష్యత్తులో పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న షట్ డౌన్ కార్యక్రమం గనుక మరికొంత కాలం కొనసాగినట్లయితే బంగారం ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి కూడా సరికొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకుని వెళ్తోంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర నేడు భారీగా పెరిగింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.