రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు..

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరం భూమి ధర రికార్డు ధర పలికింది. నాలెడ్జ్‌ సిటీలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని TGIIC వేలం వేసింది.


ఇందులో పాల్గొన్న MSN రియాలిటీ సంస్థ మొత్తం 7.6 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1357 కోట్లకు భూములు అమ్ముడుపోయాయి. ఇదిలాఉండగా తెలంగాణ హౌజింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో కూడా రికార్డు ధరలు పలికాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో చదరపు గజం ఏకంగా రూ.1.14 లక్షలు పలికింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.