ఈ పండగ సీజన్లో కొత్త మిడ్-రేంజ్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు వివో లవర్స్ అయితే వివో V50 కొనేసుకోండి. ఈ 5జీ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అతి చౌకైన ధరకే లభిస్తోంది.
భారత మార్కెట్లో వివో V50 8GB, 256GB వేరియంట్ ధర రూ.36,999కు లాంచ్ కాగా జీస్ ట్యూన్ డ్యూయల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, అద్భుతమైన డిజైన్‌తో మరింతగా ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ (Vivo V50 5G Sale) ఫెస్టివల్ సేల్ 2025 సమయంలో అన్ని బ్యాంక్ ఆఫర్లతో వివో V50 5G ఫోన్ ధర రూ. 28,100 కన్నా తగ్గింది. అమెజాన్‌లో వివో V50 5జీ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో వివో V50 5G ధర ఎంతంటే? :
ప్రస్తుతం అమెజాన్‌లో వివో V50 5G ఫోన్ రూ.28,798కి అమ్ముడవుతోంది. లాంచ్ ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలుదారులు రూ.వెయ్యి వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. నెలకు రూ.1,403 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్‌ను బట్టి రూ. 27,350 వరకు పొందవచ్చు.
వివో V50 5G స్పెసిఫికేషన్లు :
వివో V50 ఫోన్ పెద్ద 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజీతో వస్తుంది. ఈ వివో ఫోన్ 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్టు ఇస్తుంది.
ఈ వివో బ్లూటూత్ 5.4, యూఎస్బీ 2.0, జీపీఎస్, OTG ఫీచర్లను అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 50MP మెయిన్, 50MP వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
































