Nagarjuna మాజీ కోడలు పై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్.. నా పరువు పోతుంది అంటూ.?

 అక్కినేని ఫ్యామిలీ గురించి మనం ఒక్క వార్తలో చెప్పుకోలేం. సినీ ఇండస్ట్రీ అనేది ఒక మనిషి అయితే ఆ మనిషి బతకడానికి ఉండే గుండె లాంటివారు అక్కినేని ఫ్యామిలీ.


అలా సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉందంటే దానికి అక్కినేని నాగేశ్వరరావు ఒక కారణం అని కూడా చెప్పవచ్చు. అలాంటి అక్కినేని నట వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించి తన కొడుకులను కూడా ఇండస్ట్రీలో హీరోలుగా నిలబెట్టారు.

కానీ ఇందులో పెద్ద కొడుకు నాగచైతన్య ఓ మోస్తారుగా రాణిస్తున్న చిన్న కొడుకు అఖిల్ మాత్రం ఫ్లాప్ ల వెంటే తిరుగుతున్నాడు.ఇక అక్కినేని ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది మాత్రం నాగచైతన్య సమంత వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. నాగచైతన్య సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు.. కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా కాపురం చేశారు. ఆ తర్వాత వీరి మధ్య ఏం జరిగిందో ఏమో సడన్ గా విడాకులు తీసుకొని విడిపోయారు.(Nagarjuna)

ఇదే తరుణంలో సమంతకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సమంత పెళ్లి తర్వాత నాగార్జునతో రాజుగారిగది2 సినిమాలో నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయింది కానీ నాకు భయం వేస్తోంది అన్నారు.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని అనుకుంటున్నాను.

ఎందుకంటే సమంతా నేను ఇద్దరం కలిసి ఇందులో నటించాం.. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నా పరువు పోతుంది.. ఎందుకంటే సమంతా నేను ఒకే ఇంట్లో మొహం మొహం చూసుకున్నప్పుడు నా పరువు పోకూడదు తప్పకుండా సినిమా హిట్ అవ్వాలి అంటూ కామెడీగా మాట్లాడారు. మామగారి మాటలు విన్న సమంత కూడా నవ్వేసింది.. ఈ విధంగా నాగార్జున ఆ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.