సంచలన ప్రకటన.. త్వరలో డిజిటల్ కరెన్సీ

సాధారణ కరెన్సీకి ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు అత్యంత ఈజీగా, ఎఫెక్టివ్‌గా జరుగుతాయి. పేపర్ వాడకం బాగా తగ్గుతుంది.


యూనియన్ మినిష్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. భారత్ త్వరలో సొంత డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయబోతోందని ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దతుతో ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం ఖతర్‌లోని దోహలో పర్యటిస్తున్నారు. దోహలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిజిటర్ కెరెన్సీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘సాధారణ కరెన్సీకి ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు అత్యంత ఈజీగా, ఎఫెక్టివ్‌గా జరుగుతాయి. పేపర్ వాడకం బాగా తగ్గుతుంది. బ్యాంకింగ్ సిస్టమ్‌లో జరిగే లావాదేవీల కంటే డిజిటల్ కరెన్సీ లావాదేవీలు చాలా వేగవంతంగా ఉంటాయి. డిజిటల్ కరెన్సీ సిస్టమ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. ట్రాన్పరెన్సీ, ట్రేసబులిటీ ఉంటుంది’ అని అన్నారు.

కేంద్ర మంత్రి చెబుతున్న దాని ప్రకారం ప్రతీ డిజిటల్ కరెన్సీ లావాదేవీ సిస్టమ్ ద్వారా వెరిఫైయ్ చేయబడుతుంది. డిజిటల్ కరెన్సీ వాడకం ద్వారా అక్రమ లావాదేవీలకు చెక్ పెట్టొచ్చు. క్రిప్టో కరెన్సీ గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. తాము క్రిప్టో కరెన్సీని ప్రోత్సహించటం లేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీకి ఆర్‌బీఐ లాంటి సంస్థల మద్దతు లేదని, ఆస్తులు కూడా లేవని ఆయన అన్నారు. అలాంటి దాన్ని ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీకి గ్యారెంటీ లేదని స్పష్టం చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.