హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం… రోడ్లపై భారీగా వర్షపు నీరు, ఈ రూట్స్‌లో వెళ్లకపోవడమే బెటర్..

హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అమీర్‌ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ముషీరాబాద్ , చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ అబిడ్స్, కోఠి, బేగం బజార్ , నాంపల్లి, చార్మినార్, ఫలక్‌నుమా…


తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ ల్యాండ్స్ వద్ద రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో పంజాగుట్ట జంక్షన్ నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఖైరతాబాద్‌లో కూడా రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

ఇక, హైదరాబాద్ నగరంలో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచుతో కూడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ అవకాశం ఉందని తెలిపింది.

ఇక, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.