కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే

దీపావళి అమావాస్యతో ఆశ్వయుజమాసం పూర్తవుతుంది..ఆ మర్నాడు పాడ్యమి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబరు 20న దీపావళి జరుపుకుంటారు.


ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండడంతో కార్తీకమాసం…అక్టోబరు 22 బుధవారం నుంచి ప్రారంభమవుతోంది.

బ్రహ్మ ముహూర్తంలో కార్తీకస్నానం ఆచరించడంతో కార్తీకమాసం ప్రారంభమవుతుంది. అందుకే సూర్యోదయ సమయానికి ఏ రోజు అయితే పాడ్యమి తిథి ఉంటుందో ఆ రోజునుంచి ప్రారంభం. అందుకే 2025 లో అక్టోబరు 22 బుధవారం నుంచి కార్తీకమాసం మొదలవుతోంది

2022 అక్టోబరు 22 బుధవారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి

అక్టోబరు 23 గురువారం యమవిదియ – భగినీహస్త భోజనం -భాయ్ దూజ్

అక్టోబరు 25 శనివారం నాగులచవితి

అక్టోబరు 26 ఆదివారం నాగపంచమి

అక్టోబరు 27 సోమవారం కార్తీకమాసం మొదటి సోమవారం

అక్టోబరు 29 బుధవారం కార్తావీర్యజయంతి

అక్టోబరు 31 శుక్రవారం యజ్ఞావల్క జయంతి

నవంబరు 1 శనివారం కార్తీక శుక్ల ఏకాదశి

నవంబరు 02 ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి

నవంబరు 03 కార్తీకమాసం రెండో సోమవారం

నవంబరు 05 బుధవారం జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ (Karthika Pournami 2025), కేదారనోములు,గురునానక్ జయంతి

నవంబరు 10 కార్తీకమాసం మూడో సోమవారం

నవంబరు 15 శనివారం కార్తీక బహుళ ఏకాదశి

నవంబరు 16 ఆదివారం వృశ్చిక సంక్రాంతి

నవంబరు 17 కార్తీకమాసం నాలుగో సోమవారం

నవంబర్ 20 గురువారం పోలిస్వర్గం ( కార్తీకమాసం ఆఖరు రోజు)

కార్తీకం నెల రోజుల్లో సోమవారాలు, జ్వాలాతోరణం..శివుడి ప్రాముఖ్యత తెలియజేస్తే.. బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు.

కార్తీకపురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యత, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురింతి ఉంటుంది.

ఈ ఏడాది (2025) అక్టోబరు 22 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది..నవంబర్ 20 తో ముగుస్తుంది

న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం
నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్

కార్తీక మాసానికి సమానమైన నెల లేదు..శ్రీ మహావిష్ణువుకి సమానమైన దైవం లేదు..వేదాలతో సమానమైన శాస్త్రాలు లేవు..గంగతో సమానమైన తీర్థం లేదు అని ఈ శ్లోకం అర్థం.

కార్తీక మాసం మొత్తం నియమాలు పాటిస్తారు. కొందరు కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజు మాత్రమే అనుసరిస్తారు. ఈ నెల రోజులు నియమాలు పాటించేవారు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. వానాకాలం పూర్తై చలి మొదలయ్యే రోజులు కావడంతో..ఈ నెల రోజులు దుప్పట్లు, కంబళ్లు, స్వెట్టర్లు దానం చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.

కార్తీకమాసం నియమాలు పాటించేవారు ఇవి మర్చిపోవద్దు

ఈ నెల రోజులు వెల్లుల్లి, ఉల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి

ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వవద్దు

నమ్మకం లేకపోతే భగవంతుడిని పూజించవద్దు..కానీ..దైవాన్ని దూషించకండి

దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వినియోగించండి..నూనె వంటికి రాసుకోవద్దు

కార్తీకంలో మినుములు తినడం, నలుగు పెట్టుకుని స్నానం ఆచరించడం చేయకూడదు

కార్తీకమాసంలో నియమాలు పాటించేవారు..ఈ నియమాలు పాటించని వారి చేతి భోజనం చేయకూడదు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.