బ్రేక్ ఫాస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేది, ఎక్కువగా తినేది ఇడ్లీ, దోశ. ఇవి ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపికలలో కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఈ రెండూ ఒకే పులియబెట్టిన పిండి నుండి తయారైనప్పటికీ, వాటి తయారీ విధానాలు, కేలరీల సంఖ్య, బరువు తగ్గించే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి.
మీరు మీ బరువును నియంత్రించడానికి లేదా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ రెండు అల్పాహారాలలో ఏది మీకు సరైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కేలరీల: ఇడ్లీ VS దోశ
బరువు నిర్వహణలో కేలరీలు కీలకం. ఇక్కడే ఇడ్లీ.. దోశ కంటే ఒక మెట్టు పైనుంది. దీనికి ప్రధాన కారణం వాటి తయారీ విధానం.
- 1 మీడియం ఇడ్లీ (40-50 గ్రా): సుమారు 39-45 కేలరీలు
- 1 సాదా దోశ (80-100 గ్రా): సుమారు 120-150 కేలరీలు
ఇడ్లీలను ఆవిరిపై ఉడికించడం వల్ల అవి ఏ మాత్రం నూనెను పీల్చుకోవు. దీనికి విరుద్ధంగా, దోశలను సాధారణంగా క్రిస్పీగా మారడానికి నెయ్యి లేదా నూనెతో పాన్-ఫ్రై చేస్తారు. దీని వలన వాటి కేలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. దోసె తినాలనుకుంటే, ఇంట్లో నాన్-స్టిక్ పాన్ వాడండి లేదా పెసరట్టు (మూంగ్ దాల్ దోసె) ఎంచుకోండి. అది తక్కువ నూనెతో, ఎక్కువ ప్రోటీన్‌తో ఉంటుంది!
ప్రోటీన్ – ఫైబర్ బూస్ట్
ఈ రెండూ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. కానీ వెయిట్ లాస్‌కి కావాల్సింది కడుపు నింపే ప్రోటీన్, ఫైబర్.
రాగి ఇడ్లీ/దోశ: ఫైబర్, కాల్షియం అధికంగా ఉండటం వలన ఆకలిని నియంత్రిస్తుంది.
ఓట్స్ ఇడ్లీ: ఎక్కువసేపు కడుపు నిండి ఉంటుంది.
పెసరట్టు : బెస్ట్ ఆప్షన్.. కార్బోహైడ్రేట్లు తక్కువ.. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
గుడ్ ఫర్ గట్
ఇడ్లీ, దోశ.. రెండింటి పిండీ పులియబెడతాం. దీనివల్ల ప్రోబయోటిక్స్ తయారవుతాయి. ఈ ప్రోబయోటిక్స్ మీ జీర్ణవ్యవస్థని సూపర్ హెల్తీగా ఉంచుతాయి. మంచి గట్ ఉంటేనే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. సో ఈ పాయింట్‌లో రెండూ బెస్టే అని చెప్పొచ్చు.
ఏది బెస్ట్..?
బరువు తగ్గడానికి ఇడ్లీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. కానీ తక్కువ నూనెతో దోశ చేసుకుని, పక్కన హై ప్రోటీన్ సాంబార్ వేసుకుంటే.. అది కూడా సూపర్ హెల్తీ మీల్‌గా పనిచేస్తుంది. బ్రేక్ ఫాస్ట్‌లో రెండూ మంచి ఆహారాలే అయినప్పటికీ.. మీ లైఫ్ స్టైల్‌ను బట్టి ఏది కావాలో ఎంచుకోండి..
(NOTE: ఇందులోని అంశాలు నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది
































