విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ 10 రోజులు స్కూళ్లకు సెలవులు

టీవలే దసరా సెలవులు పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు వెళ్తున్నారు. అయితే విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.


కర్ణాటకలో కుల గణన సర్వే నేపథ్యంలో అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని ప్రభుత్వరంగ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

కుల గణన సర్వే నేపథ్యంలో అక్టోబర్ 8 నుంచి 18 తారీఖు వరకు కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ మేరకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం సిద్ధ రామయ్య కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే ఇంకా పూర్తి కాని నేపథ్యంలో టీచర్ల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కుల గణన సర్వే అక్టోబర్ 7 వ తారీఖులోపే పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మెమో జారీ చేసింది. పాఠశాలల టైమింగ్స్ మార్చాలని డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుల గణనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అక్టోబర్ 18 వ తారీఖు వరకు పాఠశాలలను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలో కుల గణన సర్వే సెప్టెంబర్ 22న ప్రారంభం అయింది. పలు కారణాల వల్ల గ్రేటర్ బెంగళూరులో సర్వే ఆలస్యం అయింది. కుల గణన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 420 కోట్లు ఖర్చు చేసింది. సర్వేలో భాగంగా 60 ప్రశ్నలను సిద్ధం చేసింది. కర్ణాటకలో చివరిసారిగా 2015లో కుల గణన సర్వే నిర్వహించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.