పండ్ల రసాలు తీయడం సులువిక.

బత్తాయి, కమల, ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లను తింటే వచ్చే శక్తి… మిగతా వేటిలోనూ ఉండదు. మరి వీటిని నేరుగా తినమంటే తింటారా… పిల్లలూ పెద్దలూ ఏవేవో కారణాలు చెప్పి దాటవేస్తారు. అందుకే వారికి పండ్లరసాల్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మహిళలు. కానీ వాటిని తీసే జ్యూసర్లతోనే సమస్యంతా… చేతులు నొప్పి పుడితే కానీ రసం రాదు. పైగా వృథా కూడా ఎక్కువే. ఆ సమస్యకు పరిష్కారంగా వచ్చిన జ్యూసర్లే ఇవి… 


విద్యుత్‌ అవసరం లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా, నేచురల్‌ పండ్ల రసాలు కావాలనుకునే వారికి ‘మాన్యువల్‌ హ్యాండ్‌ ప్రెస్‌ జ్యూసర్‌’ మంచి ఎంపిక. పండ్లను రెండు ముక్కలుగా కోసి, వాటిని కప్పులా కనిపించే భాగంలో పెట్టాలి. జ్యూస్‌ పడటానికి వీలుగా గ్లాస్‌ పెట్టి, లీవర్‌ని తిప్పితే సరి. కప్పుకి ఉండే రంధ్రాల నుంచి రసం గ్లాస్‌లో పడుతుంది. వృథా కప్పులోనే ఉండిపోతుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో దీన్ని తయారుచేస్తున్నారు. కాబట్టి శుభ్రం చేసుకోవడమూ సులభమే.

కొన్ని వస్తువులు చూడటానికి చిన్నగా ఉంటాయి. కానీ అవి ఇచ్చే ప్రయోజనాలు బోలెడు. ఈ ‘రీఛార్జబుల్‌ జ్యూసర్‌’ కూడా ఆ కోవకు చెందినదే. రసం తీయాలనుకున్న పండ్లను జ్యూసర్‌లో వేసి బటన్‌ నొక్కితే సరి. మోటార్‌తో నడిచే ప్రెస్సింగ్‌ ప్లేట్‌ పైకీ, కిందకీ కదులుతూ రసం తీస్తుంది. ఓవైపు నుంచి రసం, మరోవైపు నుంచి వృథానీ బయటికి పంపిస్తుంది. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 15సార్లు జ్యూస్‌ తీసుకునే సౌకర్యం ఉంటుందట. కాంపాక్ట్‌ డిజైన్‌ కాబట్టి ఆఫీసులకీ, ప్రయాణాల్లోనూ సులువుగా తీసుకువెళ్లొచ్చు.

సాధారణ జ్యూసర్లు అవసరానికి మించిన వేగం, పీడనంతో తిరుగుతాయి. దాంతో వీటిలో తయారుచేసిన రసాల్లో విటమిన్లు, ఖనిజాలు లోపిస్తాయి. గమనిస్తే రుచిలోనూ తేడా వస్తుంది. పండ్లలో ఉండే తాజాదనమే ఉండదు. కానీ ఈ ‘స్లో స్క్వీజ్‌ జ్యూసర్‌’తో ఆ సమస్యలేవీ ఉండవు. జ్యూసర్‌లో పండ్లను వేసి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు. రసాన్ని తీస్తుంది. డ్యూయల్‌ అవుట్‌లెట్‌ సిస్టమ్‌ ఉంది దీన్లో. రసాన్నీ, వృథాన్నీ వేరు చేస్తుంది. స్లో స్క్వీజ్‌ టెక్నాలజీతో పనిచేయడం వల్ల పండ్లలో తాజాదనం పోదు. బీపీఏ ఫ్రీ మెటీరియల్‌తో దీన్ని డిజైన్‌ చేస్తున్నారు. కాబట్టి మైక్రోప్లాస్టిక్స్‌ భయమే ఉండదు. ఆటోమేటిక్‌ క్లీనింగ్‌ ఆప్షన్‌ ఉంది కాబట్టి శుభ్రం చేయడమూ తేలికే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.