మీకు ఇలాంటి ఫోన్‌ కాల్‌ వచ్చిందా? గుట్టు చప్పుడు కాకుండా చేసే మోసం ఇదే.. జాగ్రత్త!

సైబర్ నేరస్థులు రకరకాల మార్గాలను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారు. ప్రతిరోజూ జనాలను మోసగించేందుకు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.


అదే కొరియర్ స్కామ్. ఈ స్కామ్‌లో మీకు తెలియకుండానే మీ ఇంటికి కొరియర్ బాక్స్ వచ్చిందని, దానిని డెలివరీ చేయనున్నట్లు మీకో ఫోన్‌ కాల్‌ వస్తుంది. మీతో ఫోన్‌టో మాట్లాడే వ్యక్తి ప్రభుత్వ అధికారిగానో లేకుండా, మీకు వచ్చిన పార్శిల్‌ డెలివరీ చేయనున్నట్లో నటిస్తూ మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. పైగా క్షణాల్లోనే మీ బ్యాంకు అకౌంట్‌ను ఖాళీ చేస్తాడు. ఇలాంటి కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొరియర్ స్కామ్ ఎలా జరుగుతుంది?:

నేరస్థులు కొరియర్ మోసాలను ఎలా నిర్వహిస్తున్నారో ఒక కేస్ స్టడీ ద్వారా అర్థం చేసుకుందాం. ఇటీవల ఒక పీహెచ్‌డీ విద్యార్థిని కొరియర్ స్కామ్ ద్వారా రూ.లక్షకు పైగా మోసం చేశారు.

గత నాలుగు నెలల కిందట ఇదే తరహాలో ఓ మోసం జరిగింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థి దారుణంగా మోసపోయాడు. ప్రముఖ డెలివరీ కంపెనీ ఫెడెక్స్ ఉద్యోగులుగా నటిస్తూ సైబర్ దొంగలు ఆ విద్యార్థి నుంచి రూ.1,34,650 మోసం చేశారు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసగాళ్లు ఆ విద్యార్థికి ఫోన్ చేసి భారతదేశంలో నిషేధించిన వస్తువులు ఉన్న కొరియర్ వచ్చిందని చెబుతూ అంతలోనే ఆ విద్యార్థిని మరో కాల్‌కు కనెక్ట్ చేసి ముంబైలోని నార్కోటిక్స్ విభాగం నుండి మాట్లాడుతున్నామని చెప్పారు. స్కైప్ కాల్ ద్వారా కూడా ఆ విద్యార్థి స్టేట్‌మెంట్ రికార్డ్ అయ్యింది.

కన్ఫర్మేషన్‌ కోసం విద్యార్థి నుండి బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత బాధితుడిపై MDMA (డ్రగ్స్) సరఫరాలో ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. నిర్దోషిగా విడుదల కావడానికి బాధితుడి నుండి రూ.1,34,650ను మరొక బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. ఉదాహరణగా ఇదొక్కటే కాదు..దేశంలో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి.

ఎలా నివారించాలి?

కొరియర్ స్కామ్‌లను నివారించడానికి ఈ భద్రతా చిట్కాలను అనుసరించండి.

  • ఏవైనా తెలియని కొరియర్ కాల్స్ లేదా ఊహించని డెలివరీ స్లిప్స్‌లను విస్మరించండి.
  • ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు లేదా OTP లను ఫోన్/వీడియో కాల్స్ ద్వారా ఎప్పుడూ పంచుకోవద్దు.
  • చట్టపరమైన కొరియర్ కంపెనీలు ఎప్పుడూ చట్టపరమైన జరిమానాలను డిమాండ్ చేయవు లేదా అరెస్టు చేస్తామని బెదిరించవు. మీకు కొరియర్ కంపెనీ పేరుతో బెదిరింపు కాల్స్ వస్తే, ఇది స్కామర్ కాల్ అని అర్థం చేసుకోండి.
  • ఏ వెబ్ లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు.
  • 1930, cybercrime.gov.in కు ఫిర్యాదు చేయండి:

మీరు ఏదైనా రకమైన సైబర్ మోసాన్ని అనుమానించినట్లయితే, నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయడం ద్వారా వెంటనే నివేదించండి. లేదా మీరు cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.