ఉడుపిలో రిషబ్‌ నివాసం.. రేట్‌ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది

రిషబ్‌ శెట్టి పేరు నేషనల్‌ లెవల్లో తెలియని వాళ్లు లేరంటే నమ్మాల్సిందే. 16 కోట్లు ఖర్చుపెట్టి ఆయన తీసిన కాంతార దాదాపు 450 కోట్లు కలెక్ట్ చేసి డివైన్‌ బ్లాక్‌ బస్టర్‌ అయింది.


ఆ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో సెకండ్‌ పార్టును తెరకెక్కిస్తే… ఇప్పటికే 427.5కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా హౌస్‌ఫుల్‌ థియేటర్లతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.
కాంతార దూకుడు చూసిన వారు అసలు రిషబ్‌శెట్టి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకోవడానికి మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి సంబంధించిన పలు విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఉడుపిలో రూ.12 కోట్లు విలువ చేసే మేన్షన్‌ ఉంది రిషబ్‌ శెట్టికి. ట్రెడిషనల్‌ కర్ణాటక ఆర్కిటెక్చర్‌కి, మోడ్రన్‌ టెక్నాలజీని జత చేసి తన అభిరుచి మేర గృహాన్ని నిర్మించుకున్నారు రిషబ్‌. కర్ణాటక ఉడుపిలోని కుందాపురలోనే ఆయన నివాసం ఉంది. కాంతార చాప్టర్‌ 1లో దాదాపు 90 శాతం పోస్ట్ ప్రొడక్షన్‌ అంతా ఆ ఊళ్లోనే జరిగింది. బర్మా టేక్‌ వుడ్‌నీ ఇత్తడిని కలగలిపి వుడ్‌ వర్క్ చేశారు రిషబ్‌ నివాసానికి. ఇంటి ముందు దాదాపు 300 కిలోల గ్రానైట్‌ రాయితో తులసి కోట ఉంటుంది. యక్షగానాన్ని తలపించే విషయాలు, యువరాజ్‌ సింగ్‌ ఆటోగ్రాఫ్‌ ఉన్న బ్యాట్‌, కాంతారలో ఉపయోగించిన రైఫిల్‌.. ఇలా.. ఇంట్లో ఉన్నప్రతిదీ రిషబ్‌ అభిరుచిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. రిషబ్‌ ఇంట్లో ఉన్న చాంటింగ్‌ కార్నర్‌ గురించి సందర్శకులు గొప్పగా చెబుతుంటారు. అక్కడున్న బ్లాక్‌ స్టోన్‌ మీద ఏడు సెకన్ల పాటు ఎవరైనా నిలుచుంటే కాంతారలోని భూతకోల ధ్వనించేలా ప్రత్యేకించిన అమర్చిన మ్యూజిక్‌ సిస్టమ్‌ ఎలాంటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటుందట.

రిషబ్‌ నివాసంలో ఉన్న ప్రైవేట్‌ స్క్రీనింగ్‌ రూమ్‌కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటాలియన్ లెదర్‌ రిక్లయినర్స్ స్పెషల్‌ అట్రాక్షన్‌ అట. డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇస్తుందట స్క్రీనింగ్‌ రూమ్‌. కిచెన్‌లో వాడిన నల్లరాతిని కొబ్బరినూనెతో పాలిష్‌ చేయించారట. రిషబ్‌ ఇంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 1200 పుస్తకాలున్నాయట. అందులో జానపదాల నుంచి స్టీఫెన్‌ కింగ్‌ నావెల్స్ వరకూ ఉంటాయట. రిషబ్‌ ఇంటి కాపరి పేరు యక్ష. రిటైర్డ్ కోస్టల్‌ పోలీస్‌ డాగ్‌ అది. ఇంటి చుట్టూ ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలుంటాయి. విజిటర్స్ ఎవరైనా ఇంటి ముందున్న బ్రాస్‌ లాకర్స్ లో ఫోన్స్ డిపాజిట్‌ చేయాల్సిందే. ప్రతి నెలా వైఫై పాస్‌ వర్డ్ మారుతుంటుంది. కాంతార లోని ఫేమస్‌ డైలాగులే పాస్‌వర్డ్స్. రిషబ్‌కి తన నివాసంలో అత్యంత ఇష్టమైన ప్రదేశం రెయిన్‌ రూమ్‌ వర్షం పడేటప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ రాసుకోవడం, ను ఎడిట్‌ చేసుకోవడం వల్ల క్రియేటివ్‌ టచ్‌ ఉంటుందని ఫీలవుతారు రిషబ్‌.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.