BREAKING: హరీశ్ రావు, KTR హౌస్ అరెస్ట్

హైదరాబాద్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ నేతలని గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్కు పిలుపునిచ్చింది.


ఈక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్సుల్లో RTC క్రాస్ రోడ్డ దగ్గర ఉన్న బస్ భవన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వారిని ఉదయం అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కీలక నాయకులను దిగ్బంధనం చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.