వెయిట్‌ లాస్‌ నుంచి షుగర్‌ కంట్రోల్‌ వరకు.. కీర దోసకాయతో టాప్‌ 5 బెనిఫిట్స్‌ ఇవే

కీరతో ఎలాంటి హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి, దీన్ని ఎలా డైట్‌లో యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.


కీర దోసకాయ (Cucumber) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సలాడ్‌లు, రైతాలో యాడ్‌ చేసుకుని అందరూ ఎంజాయ్‌ చేసే ఉంటారు. ముఖ్యంగా వెయిట్‌ లాస్‌ అవ్వాలని డైట్‌ ఫాలో అవుతున్న వాళ్లు ఎక్కువగా తింటుంటారు. కీర రిఫ్రెషింగ్, హెల్తీ వెజిటెబుల్‌. దీన్ని అన్ని వయసుల వారు ఇష్టపడతారు. కేవలం బరువు తగ్గడమే కాదు, కీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. కీరతో ఎలాంటి హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి, దీన్ని ఎలా డైట్‌లో యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

బరువు తగ్గడం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, కీరదోస మీ డైట్‌లో ఉండాల్సిందే. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు కీరా ముక్కల్లో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో ఫైబర్, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎక్కువ సమయం కడుపు నిండిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. దీన్ని తినడం వల్ల అనవసరమైన చిరుతిళ్ల జోలికి వెళ్లరు. కీరా మీ ఆకలిని నియంత్రించడంతో పాటు బరువు తగ్గడాన్ని ఈజీ చేస్తుంది.

హైడ్రేషన్‌ కీరదోస దాదాపు 95% నీటితో నిండి ఉంటుంది. ఇది నేచురల్‌గా హైడ్రేట్‌గా ఉంచే ఆప్షన్‌.   ఎనర్జీ డ్రింక్స్ తాగడం కంటే కీర దోసకాయ తినడం వల్ల బాడీ ఫ్లూయిడ్స్‌ బాగా రీస్టోర్‌ అవుతాయి. హైడ్రేట్‌గా ఉంటే, మీ బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. మీ స్కిన్‌ గ్లో, మీ మూడ్‌ ఇంప్రూవ్‌ అవుతాయి.

జీర్ణక్రియ, మలబద్ధకం   కీర దోసకాయలు నేచురల్‌గానే డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. వాటిలోని ఫైబర్, కడుపులో ఆహారం సజావుగా ప్రాసెస్‌ అయ్యేలా చేస్తుంది. మలం సాఫీగా బయటకు పోయేలా చేస్తుంది. భోజనంతో పాటు కీర తినడం వల్ల గట్ హెల్త్ బాగుంటుంది, మలబద్ధకంతో పాటు ఇతర స్టమక్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది.

ఇమ్యూనిటీ బూస్టరర్ కీర దోసకాయలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపుకు అవసరమైన మైక్రో న్యూట్రియెంట్. ఇందులో యాంటీఆక్సిడెంట్లలో కూడా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. తద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌   కీర దోసకాయలు కొద్దిగా తీపిగా ఉంటాయి, కానీ షుగర్ కంటెంట్ ఉండదు. దీంతో తీపి తినాలనే కోరికలకు హెల్తీగా చెక్‌ పెట్టవచ్చు. బ్లడ్‌లో షుగర్‌ స్పైక్స్‌ ఉండదు. కీరను డైట్‌లో యాడ్ చేసుకుంటే మధుమేహం, సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

కీర దోసకాయ ఎలా తినాలి? సలాడ్: సలాడ్‌ చేయడం చాలా ఈజీ. ముందు కీర ముక్కలను తీసుకోండి. దీనికి ఉల్లిపాయలు, టమోటా ముక్కలు యాడ్‌ చేయండి. చివరికా నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది.

రైతా: కూలింగ్‌ సైడ్‌ డిష్‌గా కీరతో చేసిన రైతా అద్భుతంగా ఉంటుంది. తురిమిన కీర దోసను పెరుగులో కలపాలి. తర్వాత పుదీనా, అవసరమైన స్పైసెస్‌ యాడ్‌ చేస్తే చాలు.

కూలింగ్‌ డ్రింక్‌: హైడ్రేటింగ్ సమ్మర్‌ డ్రింక్‌ చేసుకుని ఎంజాయ్‌ చేయవచ్చు. నిమ్మరసం, పుదీనా, కీర దోసకాయ ముక్కలు మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. ఈ డ్రింక్‌ వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది, రోజంతా కూల్‌గా ఉంచుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.