నేటి యువతరం మొబైల్ ఫోన్ కు బానిసగా మారింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే దాకా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇది పక్కన లేకపోతే నిమిషం కూడా ఉండలేనట్టుగా ప్రవర్తిస్తుంటారు ఇప్పటి యువత.
అయితే చాలామందికి నిద్ర లేవగానే ఫోన్ చూడడం అలవాటుగా మారిపోయింది. యూట్యూబ్ రీల్స్, అలారం ఆఫ్ చేయడానికి, నోటిఫికేషన్స్ చూసుకోవడానికి, మెసేజ్ లు చెక్ చేసుకోవడానికి పొద్దున్నే ఫోన్ వాడుతుంటారు. అయితే ఉదయమే ఫోన్ ను వినియోగించడం కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యులు. జీవనశైలి కూడా దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.
తాజా అధ్యయనం ప్రకారం.. ఉదయాన్నే ఫోన్ ఉపయోగించడం వల్ల ఇది మన మానసిక స్థితి పైన ఎంతో ప్రభావం చూపుతుందని అధ్యాయంలో తేలిందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఉదయం లేవగానే ఫోన్ లో వాట్సప్ మెసేజ్ లు, సోషల్ మీడియా స్టోరీలు, రీల్స్, ఈమెయిల్స్ అంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.
అలాగే మొబైల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఇటు పిల్లల పైనా, అటు పెద్దల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు. అలా కాకుండా ఉదయం లేవగానే ఫోన్ వినియోగం బదులు ఇష్టమైన వారితో కాసేపు టైమ్ స్పెండ్ చేయమని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే మొబైల్ చెక్ చేస్తూ లేని సమస్యల్ని కొని తెచ్చుకునే కంటే దీనికి దూరంగా ఉండడమే మేలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఫోన్ వినియోగం కాకుండా వ్యాయామం, ధ్యానం, వాకింగ్ వాటిపై దృష్టి పెట్టాలని అంటున్నారు.
































