శత వసంతం.. టేకు చెదరని భవనం

విద్యాలయాలు, వైద్యశాలలు, దేవాలయాలకు భూవిరాళం అందజేసిన రావూసాహెబ్‌ బండ్ల బాపయ్యశెట్టి 1921లో వేటపాలెం పరిధి రావూరిపేటలో నివాసం ఉండేందుకు మూడంతస్థుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ రోజుల్లో ఆయన చేనేత వ్యాపారం నిమిత్తం చెన్నై, సింగపూర్, బర్మా వెళ్లేవారు. ఆనాడు రంగూన్‌ టేకును ఇక్కడికి పడవుల ద్వారా తెప్పించి ఇంటి నిర్మాణానికి వినియోగించారు. భవనం లోపల ఎనిమిది స్తంభాలతో బాల్కనీ ఏర్పాటు చేశారు. ఆ రోజున వాడిన టేకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బాపయ్యశెట్టి తుదిశ్వాస విడిచే వరకు ఆయన ఇందులో నివాసం ఉన్నారు. ఈ భవనం గురించి అప్పుడు గొప్పగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇందులో ఉండటం లేదు. ఓ ట్యూషన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.