నోబెల్‌’ గ్రహీతలకు ఎంత ప్రైజ్‌మనీ వస్తుందో తెలుసా.. ఆసక్తికర విశేషాలు మీకోసం..

 ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో నోబెల్‌ బహుమతి (Nobel Prize) ఒకటి. ఈ బహుమతిని పొందేందుకు ఎంతోమంది ఎదురుచూస్తుంటారు.


అయితే, అందరికీ అది వరించదు. ప్రస్తుతం 2025 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం, లిటరేచర్‌లో పురస్కారాలను స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ నోబెల్‌ శాంతి బహుమతిని కూడా ప్రకటించింది. వెనెజువెలా (Venezuela) దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో (María Corina Machad) కు ‘శాంతి’ పురస్కారం వరించింది. అయితే, ఈ ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతలకు అందే నగదు గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌

నోబెల్‌ శాంతి బహుమతి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నెబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్‌ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మానవజాతికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులు, సంస్థలను ఈ పురస్కారంతో సత్కరిస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.

మొత్తం ఆరు విభాగాల్లో..

ఇక ఈ అవార్డులను మొత్తం ఆరు విభాగాల్లో ప్రకటిస్తున్నారు. వైద్య, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, లిటరేచర్‌, శాంతి, సాహిత్యం విభాగాల్లో మానవాళికి ప్రయోజనం చేకూర్చిన వారికి ఏటా ఈ బహుమతులను ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. నోబెల్‌ ప్రైజ్‌ గ్రహీతలకు బహుమతితోపాటూ పతకం, డిప్లొమా (సర్టిఫికెట్‌) కూడా అందజేస్తారు.

23 క్యారెట్ల నుంచి 18 క్యారెట్లకు ..

నోబెల్‌ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్‌ శిల్పి గుస్తాన్‌ విజెలాండఖ, స్వీడిష్‌కి చెందిన ఎరిక్ లిండ్‌బర్గ్ సహకారంతో రూపొందించారు. దీన్ని మొదటిసారిగా 1902లో అవార్డు ప్రదానోత్సవానికి ఉపయోగించారు. తొలుత ఈ పతకాన్ని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేసేవారు. దాని బరువు 192 గ్రాములుగా ఉండేది. ఆ తర్వాత 1980లో కొన్ని మార్పులు చేశారు. పతకాన్ని 18 క్యారెట్ల బంగారంగా మార్చారు. అంతేకాదు దాని బరువుని 192 గ్రాముల నుంచి 196 గ్రాములకు పెంచారు. ఇక ఈ పతకం ముందు భాగంలో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ చుట్టూ నోబెల్‌ పేరు, ఇతర వివరాలు ఉంటాయి. వెనుక భాగంలో ముగ్గురు వ్యక్తులు ఆలింగనం చేసుకుంటున్నట్లుగా దీన్ని రూపొందించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.