దేశంలో బంగారం ధరించే ప్రేమికులు కంటే.. పెట్టుబడిగా ఇన్వెస్ట్ చేసే వారు ఉన్నారు. ఎందుకంటే బంగారం రోజురోజుకి భారీగా పెరుగుతోంది. దీంతో ఎక్కువ శాతం మంది వీటిపైనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు.
అయితే కొందరు ఫిజికల్ బంగారం కంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ లేదా గోల్డ్ ETFలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఈ గోల్డ్ బాండ్స్ అనేవి స్టాక్ మాదిరిగా మారుతుంటాయి. ఈ గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని నెలల్లోనే కోటీశ్వరులు అవుతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో దాదాపుగా 15% బంగారంలో పెట్టాలి. దీనివల్ల మార్కెట్లు పడిపోయినప్పుడు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. అయితే పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ గోల్డ్ బాండ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీఈఎస్
ఇందులో ఇన్వెస్ట్ చేస్తే తొందరగా లాభాలు వస్తాయి. ఉదాహరణకు ఇందులో మీరు 2007లో ఒక రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు అది రూ.1 కోటి కంటే ఎక్కువ అయ్యేది. గత 18 ఏళ్లలో భారీగా రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం దీని మొత్తం ఆస్తులు రూ.24,000 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు లాభం కూడా వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.22 లక్షలపైనే ఉంది. గతేడాది బంగారం 21 శాతం పెరిగితే ఈ ఏడాది 60 శాతం పెరిగింది. బంగారం ధరలు పెరగడమే.. కానీ అసలు తగ్గడం లేదు. అందుకు ఎక్కువ శాతం మంది ఇలాంటి గోల్డ్ ETFలలో పెట్టుబడి పెడుతున్నారు. మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో అవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
బంగారం కొనుగోలు చేసినా..
ఫిజికల్ బంగారం కంటే గోల్డ్ బాండ్స్ ఒకరకంగా బెటర్ అని చెప్పవచ్చు. మార్కెట్‌ను బట్టి దాని ఇంకా పెరుగుతుంది. అదే ఫిజికల్ బంగారం ఐటెమ్ వల్ల దాని ధర కాస్త తగ్గుతుంది. దీనివల్ల మీకు కొంత నష్టం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫిజికల్ బంగారం కంటే ఇలాంటి బాండ్స్ కొనడానికి ప్రయత్నించండి.
































