హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం 4 వైపుల విస్తరిస్తోంది. ఒకప్పుడు కేవలం పశ్చిమ వైపు మాత్రమే విస్తరించిన రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం అన్ని వైపులా అత్యంత వేగంగా విస్తరిస్తోంది అని చెప్పవచ్చు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఐటి రంగం నగరంలోని పశ్చిమ ప్రాంతం అయినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కోకాపేట ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతం అయినప్పటికీ ప్రస్తుతం ఐటీ రంగం మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఒకప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం జరిగిన దశాబ్ద కాలంలో పెద్ద ఎత్తున ఐటీ రంగం మాదాపూర్ కేంద్రంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో విస్తరించింది. అయితే మళ్లీ హైటెక్ సిటీ మాదాపూర్ తరహాలో హైదరాబాద్లో మరో ప్రాంతం కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది ఏ ప్రాంతంలో ఉందో ఇప్పుడే తెలుసుకుందాం.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు పలు రెసిడెన్షియల్ అదే విధంగా కమర్షియల్ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి.
భవిష్యత్తులో గచ్చిబౌలి మాదాపూర్ తరహాలో ఏ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది హైదరాబాద్ నగరంలో అనే సందేహం చాలా మందికి రావచ్చు. అయితే హైదరాబాద్ దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆదిభట్ల, కొంగరకలాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఐటీ రంగం, ఏరో స్పేస్ టెక్నాలజీ రంగాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం కూడా భవిష్యత్తులో మరొక హైటెక్ సిటీ అయ్యే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిజానికి ఇప్పటికే ఆదిభట్ల, కొంగరకలాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో టాటా ఏరోస్పేస్, GMR ఏరోస్పేస్ వంటి సంస్థలు తమ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. దీనికి తోడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా ఈ లొకేషన్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆదిభట్ల ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. అపార్ట్మెంట్ ప్లాట్స్ కూడా నిర్మాణం జరుగుతోంది. అలాగే ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు సైతం ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే తక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అపార్ట్మెంట్ ప్లాట్స్ ధరల విషయానికి వచ్చినట్లయితే 40 లక్షల రూపాయల నుంచి ఈ ప్రాంతంలో ప్రారంభం అవుతున్నాయి. ఇక అలాగే ఇండిపెండెంట్ ఇళ్ల విషయానికి వస్తే 60 లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పలుకుతున్నాయి. విస్తీర్ణాన్ని బట్టి ధరలు మారుతున్నాయి.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.



































