చీరాలలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి

 బాపట్ల జిల్లా చీరాలలో విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.


వివరాల్లోకి వెళ్లే ఆదివారం వీకెండ్‌ కావడంతో సేదతీరేందుకు పలువురు చీరాల బీచ్‌కు వచ్చారు.

అక్కడ స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఎనిమిది మంది సముద్రం లోపలికి కొట్టుకుపోయిరు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురు నీటిలో మునిగి మరణించారు.

మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ప్రాణాలకు తెగించి నలుగురు యువకులను రక్షించారు. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్‌ ఆసిఫ్‌, ఎస్‌కే ఆర్ఫాద్‌, ఎస్‌కే సికిందర్‌, షరీఫ్‌ ఆదివారం ఉదయం మంగినపూడి బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి వారు కొట్టుకుపోయారు. ఇది గమనించిన కానిస్టేబుళ్లు నాంచారయ్య, శేఖర్‌ హుటాహుటిన నీటిలోకి వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.