ఈ చేపలు తింటే.. అంతే సంగతులు.. అనారోగ్యాన్ని వెంట పెట్టుకున్నట్టే.

చేపలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ కొన్ని రకాల చేపలు మేలు చేయకపోగా నష్టమే ఎక్కువ చేస్తాయని మీకు తెలుసా..? ఈ చేపల్లో అధికంగా పాదరసం (Mercury) ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు ఈ రకాల చేపలను తినకుండా ఉండటం మంచిది. మరి ఆరోగ్యానికి హానికరం చేసే చేపలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యూనా చేపల్లో పాదరసం స్థాయిలు వివిధ రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా బ్లూఫిన్, బిగ్ ఐ ట్యూనా వంటి చేపలు అధిక పాదరసం కలిగి ఉంటాయి. అయితే అల్బాకోర్ ట్యూనా ఒమేగా-3లతో పోషకవంతమైనా వారానికి ఒక్కసారి మాత్రమే తినాలని సూచిస్తున్నారు. అంతేగానీ ఎక్కువగా తింటే మెదడు పనితీరు, నరాల ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది.


సార్డిన్ చేపలు అధికంగా పాదరసం కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే నరాల సమస్యలు, మెదడు పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు వీటిని పూర్తిగా తినడం మానేయాలి.

క్యాట్ ఫిష్ ఇవి సాధారణంగా సహజంగా నీటిలో దొరికితే మేలు చేస్తాయి. కానీ మార్కెట్‌లో లభించే క్యాట్ ఫిష్ చాలా సార్లు హార్మోన్లు, కెమికల్స్‌తో పెంచబడతాయి. దీని వల్ల మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే పెద్ద సైజులో ఉన్న క్యాట్ ఫిష్‌ను కొనుగోలు చేయకుండా చిన్న సైజులో ఉన్నవాటిని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మాకెరెల్ చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే పసిఫిక్ మహాసముద్రంలోని కింగ్ మాకెరెల్ అధిక స్థాయిలో పాదరసాన్ని కలిగి ఉంటుంది. దీని కారణంగా కిడ్నీలు, నరాల వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు వీటిని పూర్తిగా తినకుండా ఉండటం మంచిది.

బసా అనే చేప క్యాట్ ఫిష్ జాతికి చెందినది. దీన్ని చాలా రెస్టారెంట్లు చేపల కూరకు ఉపయోగిస్తారు. అయితే ఈ చేప ఆరోగ్యానికి అంత మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండటంతో గుండెపోటుకు గల అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా కొన్ని కేసుల్లో ఈ చేపల పెంపకానికి హార్మోన్లు, కెమికల్స్ ఉపయోగించడం వల్ల మరింత ప్రమాదం ఉండొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.