అల్లు అర్జున్ రాత్రికి రాత్రే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈయన తీసుకున్న నిర్ణయంతో చాలామంది మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
మరి ఇంతకీ అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్..ఒకప్పుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్,చిరంజీవిల కాలంలో ఉన్న ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ ని మళ్ళీ అల్లు అర్జున్ తిరిగి ప్రారంభించారు.అయితే ఇప్పటి జనరేషన్లో ఉన్న చాలా మంది హీరోలకు కూడా ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ లు ఉన్నాయి.
Allu Arjun took a shocking decision overnight
కానీ అల్లు అర్జున్ దాన్ని మరోసారి కొత్తగా తీసుకోచ్చారు. ఇన్ని రోజులు అల్లు ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ లోనే ఉండేవారు. కానీ గత కొద్దిరోజుల నుండి జరుగుతున్న పరిణామాల కారణంగా అల్లు అర్జున్ ఆయన అభిమానుల కోరిక మేరకు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మెగా ఫ్యాన్స్ కింద అల్లు ఫ్యాన్స్ అని చెప్పుకోవడం అల్లు అర్జున్ అభిమానులకు ఇష్టం లేదు.అందుకే అభిమానుల కోసం కొత్తగా ఒక ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. (Allu Arjun)
నిన్న రాత్రి హైదరాబాద్లో తన అభిమానులందరినీ కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని జిల్లాలలో కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.అనంతరం వారితో మాట్లాడి ఫోటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేశారు.
అయితే ఈ విషయం బయట పడడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి ఇంత సడన్గా అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారెందుకు.. మెగా ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్లో ఉండడం ఇష్టం లేకే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభిమానుల మీద నెట్టేస్తున్నారా..అల్లు అర్జున్ కి కలిసి ఉండడం ఇష్టం లేక అభిమానుల మీద ఆ విషయాన్ని నెట్టేస్తున్నారా అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.
































