వాటర్ హీటర్ వాడుతున్నారా.. ఈ 5 తప్పులు చేస్తే మీ పని అయిపోయినట్లు..

డి చేతులతో తాకకూడదు: ఇమ్మర్షన్ హీటర్ వాడేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. నీరు విద్యుత్‌ను సులభంగా ప్రసరించేలా చేస్తుంది. కాబట్టి తడి చేతులతో హీటర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడం చాలా ప్రమాదకరం.


కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఎల్లప్పుడూ పొడి చేతులతో మాత్రమే స్విచ్‌ను లేదా రాడ్‌ను తాకాలని గుర్తుంచుకోండి.

ఇనుప బకెట్‌లో వాడొద్దు: చాలామంది చేసే మరో రిస్క్ ఏంటంటే.. ఇనుప బకెట్‌లో హీటర్‌ను ఉపయోగించడం. ఇనుము కూడా కరెంట్‌ను ఈజీగా పట్టేస్తుంది. కాబట్టి షాక్ కొట్టే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఎల్లప్పుడూ ప్లాస్టిక్ బకెట్‌నే వాడండి. అదే సురక్షితం.

ముంచకుండా ఆన్ చేయొద్దు: రాడ్‌ను బకెట్‌లోని నీళ్లలో పూర్తిగా ముంచకముందే స్విచ్ ఆన్ చేయకండి. ఇలా చేస్తే రాడ్ పాడైపోయి, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ముందు రాడ్‌ను నీళ్లలో పూర్తిగా ముంచండి, ఆ తర్వాతే స్విచ్ ఆన్ చేయండి.

వేడెక్కాక తీసేయాలి: నీళ్లు వేడెక్కిన తర్వాత కూడా రాడ్‌ను బకెట్‌లో అలాగే ఉంచేయకండి. ఇలా చేస్తే కరెంట్ వేస్ట్ అవుతుంది. అంతేకాదు రాడ్‌కు తుప్పు పట్టి త్వరగా పాడైపోతుంది. అందుకే స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాతే రాడ్‌ను నీళ్లలోంచి బయటకు తీయండి.

నీళ్లు ఎక్కువ – తక్కువ ఉండొద్దు: బకెట్‌లో నీళ్లు చాలా తక్కువగా ఉంటే రాడ్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే మరీ నిండుగా ఉంటే నీళ్లు వేడెక్కడానికి ఎక్కువ సమయం పట్టి కరెంట్ ఖర్చు పెరుగుతుంది. రాడ్ మొత్తం మునిగేంత నీళ్లు ఉంటే సరిపోతుంది. ఈ సులభమైన టిప్స్ పాటిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.