పెళ్లి కోసం 15ఏళ్లు ఆగాము.. ఎందుకంటే: కీర్తి సురేశ్‌

కీర్తి సురేశ్‌(Keerthy Suresh) తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్‌తో గతేడాది వివాహం అయింది. హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.


కొచ్చి, చెన్నైలలో ఆంథోనికి వ్యాపారాలున్నాయి. కాలేజీ రోజుల్లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అలా 15 ఏళ్ల పాటు రహస్యంగా ఉన్న వారి ప్రేమ.. పెళ్లితోనే ప్రపంచానికి చెప్పారు. అయితే, పెళ్లి కోసం అంత సమయం ఎందుకు ఆగాల్సి వచ్చిందో తాజాగా కీర్తి చెప్పింది.

ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఒక టాక్‌ షోలో కీర్తి సురేశ​్‌ తన పెళ్లి, ప్రేమ గురించి ఇలా చెప్పింది. ‘పెళ్లి విషయంలో మేము కావాలనే సమయం తీసుకున్నాం. కాలేజీ రోజుల్లోనే (2010) ప్రేమలో పడ్డాం. కానీ, ముందు నా చదువు పూర్తి కావాలని ఆలోచించాను. కెరీర్‌ పరంగా ఎటువైపు అనేది కూడా ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ, జీవితంలో ఇద్దరం స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

అయితే, గత ఆరేళ్లుగా నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. తను ఖతార్‌లో ఉన్నాడు. అక్కడ ఆయిల్‌ పరిశ్రమలో వ్యాపారం చూసుకునే వాడు. ఇప్పుడు ఓకే పెళ్లి గురించి ఇంట్లో చెబుదామని అనుకున్నాం. కానీ, ఇంట్లో రిలీజియన్‌ (మతం)గురించి ఏమైనా డిఫరెన్స్‌ ఉంటాయని కూడా భయపడ్డాను. అయినప్పటికీ ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్లి ఆంథోనీ గురించి చెప్పాను. ఆ సమయంలో నాన్న నుంచి ఎలాంటి వ్యతిరేఖత రాలేదు. సింపుల్‌గానే పెళ్లికి ఒప్పుకున్నారు. నాలుగేళ్ల క్రితమే తన ప్రేమ విషయాన్ని నాన్నతో చెప్పాను.’ అని కీర్తి గుర్తు చేసుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.