జియో ఫ్యామిలీ ప్లాన్.. ఒకేసారి 4 సిమ్‌లకు..

ప్రీపెయిడ్ వినియోగదారుల తరహాలోనే, జియో తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు కూడా అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు, పలు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉంటాయి.


అందులో ఒకటి రూ.749 పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్. వినియోగదారులకు మెరుగైన డేటా, కాలింగ్, వినోద అనుభవాన్ని అందించే ప్లాన్ ఇది.

ప్లాన్ ప్రయోజనాలు
ఈ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.749. ఇందులో 100 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అదనపు డేటా అవసరమైతే ఒక జీబీకి రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

ఫ్యామిలీ సిమ్‌ కార్డులు
మొత్తం 4 మంది వరకు ప్లాన్‌ను పంచుకోవచ్చు (ప్రధాన సిమ్‌తో పాటు 3 అదనపు ఫ్యామిలీ సిమ్స్). ప్రతి అదనపు సిమ్‌కు 5GB డేటా లభిస్తుంది. ఒక్కో ఫ్యామిలీ సిమ్ కోసం నెలకు రూ.150 అదనంగా చెల్లించాలి.

ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు
* నెట్‌ఫ్లిక్స్‌ (మొబైల్ ప్లాన్)
* అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ – 2 సంవత్సరాల ఉచిత సబ్‌స్క్రిప్షన్
* జియో సినిమా, జియో టీవీ – ఉచిత యాక్సెస్
* డిస్నీ+ హాట్‌స్టార్‌ (మొబైల్)- 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్
* జియోక్లౌడ్‌ స్టోరేజ్ – 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్

ఈ ప్లాన్ కుటుంబ వినియోగదారులకు, ఓటీటీ వినోదాన్ని ఆస్వాదించే వారికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకే ప్లాన్‌ను కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటే ఇది అద్భుతమైన ఎంపిక.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.