అందరి చూపు వైజాగ్ వైపే, చారిత్రక ఒప్పందం- ప్రధానికి సుందర్ పిచాయ్ ఫోన్

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమైంది. విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ AI హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది.


రూ.87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2029 నాటికి విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ఏపీ చరిత్రలో కీలక మైలు రాయిగా నిలిచిపోనుంది.

విశాఖ కేంద్రంగా గుగూల్ డేటా సెంటర్ కు తొలి అడుగు పడింది. కేంద్ర మంత్రుల సమక్షంలో ఢిల్లీ లో ఏపీ ప్రభుత్వం గుగూల్ తో ఒప్పందం చేసుకుంది. ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో 1.88 లక్షల మందికి ఉపాధి లభించనుంది.

ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చాం, ప్రస్తుతం విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్‌ కనెక్టివిటీ, డేటా సెంటర్‌, ఏఐ, రియల్‌టైమ్‌ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు.

సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ మనందరి లక్ష్యమని వెల్లడించారు. హార్డ్‌ వర్క్‌ కాదు, స్మార్ట్‌ వర్క్‌ నినాదం తీసుకొచ్చామన్నారు. ఐదేళ్లలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషదాయకం అని సీఎం అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్​కు ధన్యవాదాలు సీఎం తెలియజేశారు.

డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయంగా మంత్రి లోకేష్ చెప్పారు. గ్లోబల్ టెక్ మ్యాప్‌పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందన్నారు. ఏపీ, గూగుల్‌కే కాదు… భారత్‌కు కూడా ఇదొక చరిత్రాత్మకమైన రోజుగా లోకేష్ అభివర్ణించారు.

విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తామని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్‌ వెల్లడించారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. అమెరికా వెలుపల పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అని చెప్పారు. జెమినీ-ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు.

ఇక.. ఈ ఒప్పందం పైన సుందర్ పిచయ్ స్పందించారు. ఈ నిర్ణయం ఒక లాండ్ మార్క్ గా నిలిచిపోతుందన్నారు. కాగా.. ప్రధాని మోదీ సైతం స్పందిస్తూ.. టెక్నాలజీ లో భారత్ గ్లోబల్ లీడర్ గా నిలుస్తుందన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. కాగా.. ఇప్పుడు ఈ ఒప్పందం ఏపీకి మైలురాయిగా నిలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.