రూ.6799 ధరకే కిందపడినా డ్యామేజీ కాని, సిగ్నల్‌ లేకున్నా కాల్స్‌ చేసుకొనే అవకాశం ఉన్న ఫోన్

న్ఫినిక్స్‌ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్‌ (Infinix Smart 10 Smartphone) ఇటీవల భారత్ మార్కెట్‌ లోకి వచ్చింది. రూ.7000 కంటే తక్కువ ధరలో ఫోన్ కోసం చూస్తుంటే, ఈ ఫోన్‌ను మీరు పరిశీలించవచ్చు.


ఈ ఫోన్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ ను కలిగి ఉంది. మరియు 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

రూ.6799 ధరకే స్మార్ట్‌ఫోన్ :

ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ 10 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.6,799 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బ్యాంగ్‌ దీపావళి 2025 సేల్‌ లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్ ఐరిస్‌ బ్లూ, స్లీక్‌ బ్లాక్‌, టైటానియం సిల్వర్‌, ట్విలైట్‌ గోల్డ్ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :

ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 700 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

పొరపాటున కిందపడినా :

ఈ ఫోన్‌లో మరో బెస్ట్‌ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డ్రాప్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. 25 వేలకు పైగా డ్రాప్‌ టెస్ట్‌లు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. అంటే పొరపాటున కింద పడినా స్మార్ట్‌ఫోన్‌ డ్యామేజీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Unisoc T7250 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4x ర్యామ్‌, 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15.1 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

నెట్‌వర్క్‌ లేకున్నా కాల్స్‌! :

ఈ ఫోన్ Folax AI వాయిస్ అసిస్టెంట్‌, రైటింగ్ అసిస్టెంట్, డాక్యుమెంట్‌ అసిస్టెంట్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ అల్ట్రా లింక్‌ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది. ఈ ఫీచర్‌తో నెట్‌వర్క్‌ తక్కువగా ఉన్న లేదా పూర్తి నెట్‌వర్క్‌ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కాల్స్‌ చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్‌ ఫోన్‌ల మధ్యనే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

5000mAh బ్యాటరీ, DTS స్పీకర్లు :

ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ 10 స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్‌, Wi-Fi ను కలిగి ఉంది. దీంతోపాటు GPS, OTG, 3.5mm ఆడియో జాక్, FM, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. DTS సపోర్టుతో డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.