ఈ న్యాచురల్ సీరంతో మీ జుట్టు రెట్టింపు ఒత్తుగా మారుతుంది… తెలుసా..పల్చని జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? జుట్టును దట్టంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారా?
ఒత్తైన కురుల కోసం రకరకాల కేశ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారా? అయితే, ఇప్పుడు చెప్పబోయే సహజ సీరం గురించి తెలుసుకోవడం మిస్ కాకండి. ఈ సీరం కొత్త జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది మరియు మీ జుట్టును రెట్టింపు ఒత్తుగా మార్చుతుంది. ఈ సీరం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా, ఒక గిన్నె తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి, నీటితో ఒకసారి కడిగి శుభ్రం చేయాలి. ఆ తర్వాత, ఒక గ్లాసు నీటిని పోసి, రాత్రంతా బియ్యాన్ని నానబెట్టాలి. మరుసటి రోజు, స్టవ్ ఆన్ చేసి, మందపాటి పాత్రలో నానబెట్టిన బియ్యాన్ని నీటితో సహా వేయాలి. అందులో 5-6 మందారం పుష్పాలు (హిబిస్కస్) వేసి, చిన్న మంటపై సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి.
తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, స్ట్రైనర్ సహాయంతో నీటిని వడకట్టి, చల్లారనివ్వాలి. ఈ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆముదం వేసి, రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా చేస్తే మీ సీరం సిద్ధం అవుతుంది.
ఈ సీరంను తలకు మరియు జుట్టు మొత్తానికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు పట్టించి, సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత, తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రంగా కడిగేయాలి.
వారానికి ఒకసారి ఈ సీరంను తయారు చేసి ఉపయోగిస్తే, జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. అదే సమయంలో, కొత్త జుట్టు ఎదుగుదల ప్రారంభమవుతుంది, కురులు దట్టంగా మారతాయి. ఈ సీరం వాడటం వల్ల జుట్టు దెబ్బతినే సమస్య తగ్గుతుంది, మరియు జుట్టు బలంగా, మెరిసేలా మారుతుంది. కాబట్టి, ఒత్తైన, దృఢమైన జుట్టు కోరుకునేవారు ఈ సహజ సీరంను తప్పకుండా తయారు చేసి ఉపయోగించండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.
































