టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన

 తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక ప్రకటన చేసింది. తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని ఈ రోజు(అక్టోబర్ 15) నుంచి 24వ తేదీ వరకు అందించనున్నారు.


తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు వారి టీటీడీ స్మార్ట్ ఐడీ కార్డులతో ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ కోరుతోంది. టీటీడీ పింఛన్‌దార్లు వారి కుటుంబ పింఛన్ దారులు, సిపిఎస్ వారికి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ అందజేస్తారు.

పీపీఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో 164 నుంచి 5,500 వరకు, అక్టోబర్ 17వ తేదీన 5,501 నుంచి 7,000 వరకు, అక్టోబర్ 18న 7,001 నుంచి 8,500, అక్టోబర్ 22న 8,501 నుంచి 10,000 వరకు, అక్టోబర్ 23వ తేదీన 10,000 నుంచి 12,500 వరకు, అక్టోబర్ 24వ తేదీన 12,500 నుంచి మిగిలిన పిపిఓ నెంబర్ల వారికి ప్రసాదాలు అందిస్తారు. విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.