ఏపీ మహిళా,శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ ఖాళీలు – దరఖాస్తు తేదీలివే

ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 20 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.


అర్హత గల అభ్యర్థులు ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. కేవలం ఆఫ్ లైన్ లోనే ఈ అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్ లైన్ విధానం లేదు. https://ntr.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా అకౌంటెంట్ నుంచి వాచ్ మెన్ వరకు పోస్టుల ఉన్నాయి. మొత్తం 13 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుండగా… భర్తీ చేసే పోస్టుల సంఖ్య 20గా ఉంది.

ఆయా పోస్టులు అధికంగా 6 ఉన్నాయి.

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.పోస్టులను అనుసరించి రూ.7,944 – రూ.18,536 మధ్య జీతం చెల్లిస్తారు.

పూర్తి చేసిన దరఖాస్తులను “డిస్ట్రిక్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-294, Gadde Purna CHandra Rao Road, మారుతీ నగర్, సెకండ్ లేన్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా” చిరునామాలో సమర్పించాలి. అప్లికేషన్ ఫారమ్ తో పాటు మీ ధ్రువపత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీని కూడా జత చేయాలి.

దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. పూర్తి వివరాలను https://ntr.ap.gov.in/notice_category/recruitment/ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.