ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ? కీలక నిర్ణయం దిశగా.

పీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్ద విషయంలో ఓ కీలక మార్పుకు రంగం సిద్దం చేస్తోంది.


అప్పట్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను అధికారికంగానే ఎత్తేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల విషయంలో మరో నిర్ణయం దిశగా పావులు కదుపుతున్నారు.

గతంలో వాలంటీర్లు సంక్షేమ పథకాలను లబ్దిదారులకు ఇంటింటికీ వెళ్లి అందించేవారు. అలాగే కొత్తగా ఏ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా, ఏదైనా కారణంతో రాకపోయినా దాని ఫాలో అప్ చేయాలన్నా వారే చేసే వారు. దీంతో ఎమ్మెల్యేలకు సైతం వీటి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ కూటమి సర్కార్ రాగానే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను అనధికారికంగానే రద్దు చేశారు. అలాగే వీరు పంపిణీ చేసిన పెన్షన్లను సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తున్నారు. అలాగే గతంలో వాలంటీర్లు చేసిన పలు పనుల్ని సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూనే ఉన్నారు.

అయితే ఇదంతా అనధికారికంగానే సాగుతోంది. తమ విధుల్లో భాగం కాని, వాలంటీర్ల విధుల్ని తమకు అప్పగించడంపై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు కోర్టును ఆశ్రయించేందుకు సైతం సిద్దమవుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. గతంలో వాలంటీర్లు నిర్వహించిన పలు విధుల్ని ఇకపై సచివాలయ ఉద్యోగులకు అధికారికంగానే అప్పగించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఫైలు కదులుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం అధికారికంగా వాలంటీర్ల విధుల్ని సచివాలయ ఉద్యోగులే నిర్వహించాలని ఇప్పుడు జీవో జారీ చేస్తే.. వారు కోర్టుల్ని ఆశ్రయించే అవకాశం ఉండదు. అదే జీవో జారీ చేయకుండా ఉద్యోగులతో వాలంటీర్ల విధుల నిర్వహణకు వాడుకుంటుంటే వారు కోర్టుల్ని ఆశ్రయించే స్టే తెచ్చుకుంటే ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే నిరసనలకు దిగుతున్న సచివాలయ ఉద్యోగులు భగ్గుమనే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.